WGL: మేడారం మహా జాతర నేపథ్యంలో నర్సంపేట నుంచి బస్సు సర్వీసు ప్రారంభించినట్లు డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ తెలిపారు. ఆర్టీసీ అధికారులు, సిబ్బందితో కలిసి బుధవారం ఆమె బస్సును ప్రారంభించారు. ప్రయాణికుల సంఖ్యను బట్టి నర్సంపేట బస్టాండ్ నుంచి బస్సులను నడిపిస్తామని, భక్తులు ప్రయాణికులు అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు.