TG: ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. సైబర్ క్రైమ్ పీఎస్లో నమోదైన 5 కేసుల్లో బెయిల్ ఇవ్వాలని రవి కోరాడు. కేసు దర్యాప్తు దశలో ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. అలాగే, రవి విదేశాల్లో పౌరసత్వం కలిగి ఉన్నాడని, బెయిల్ ఇస్తే దేశం దాటిపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో రవి బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది.