లైంగిక వేధింపుల నుంచి రక్షణ కోసం ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు కొత్త ఫీచర్‌ను ప్రారంభించనున్నది. డైరెక్ట్‌గా వచ్చే మెసేజ్‌ల్లో ఉన్న నగ్న ఇమేజ్‌లు లేదా వీడియోలకు బ్లర్ ఫీచర్‌ను జోడిస్తున్నట్లు ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది.
Instagram: ప్రస్తుతం యువత ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ యాప్‌ను వినియోగిస్తున్నారు. ఇందులో రీల్స్ చేస్తూ, మరికొందరు చూస్తూ టైమ్ పాస్ చేస్తుంటారు. అయితే కొంతమంది అమ్మాయిలను అసభ్యకర ఫొటోలు, వీడియోలతో ఇబ్బందిపెడుతుంటారు. అయితే లైంగిక వేధింపుల నుంచి రక్షణ కోసం ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు కొత్త ఫీచర్‌ను ప్రారంభించనున్నది. డైరెక్ట్‌గా వచ్చే మెసేజ్‌ల్లో ఉన్న నగ్న ఇమేజ్‌లు లేదా వీడియోలకు బ్లర్ ఫీచర్‌ను జోడిస్తున్నట్లు ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. యూజర్ల మొబైల్ ఫోన్లలో ఉండే టూల్ డీఎమ్లలోని చిత్రాలను ఎప్పటికప్పుడు పరిశీలించి బ్లర్ చేస్తుంది.
18 ఏళ్ల లోపు వారి ఫోన్లలో ఈ ఫీచర్ డీఫాల్ట్‌గా ఉంటుంది. మిగతా వాళ్లు దీన్ని యాక్టివేట్ చేసేలా ప్రోత్సహించేందుకు నోటిఫికేషన్లు పంపిస్తామని తెలిపాయి. యూజర్ల మొబైల్ ఫోన్లోని మెషిన్ లెర్నింగ్ టూల్ ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ విధానంలో చిత్రాల పరిశీలన జరుపుతుందని సంస్థ తెలిపింది. ఇన్‌స్టాలో డైరెక్ట్ మెసేజ్‌లకు ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ను అందుబాటులోకి తెచ్చేందుకు కూడా ప్రయత్నిస్తున్నామని సంస్థ తెలిపింది. ప్రస్తుతం మెటా మెసెంజర్, వాట్సాప్‌లో ఈ ఎన్క్రిప్షన్ అందుబాటులో ఉంది.