NGKL: నాగర్ కర్నూల్ పట్టణ ప్రజల దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం దక్కింది. నాగర్ కర్నూల్ పట్టణంలోని ట్యాంక్ బండ్ వద్ద హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.10 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వర్షాకాలంలో చెరువు పొంగిపొర్లి రాకపోకలు నిలిచే ఇబ్బందులు ఇక తీరనున్నాయి. గత ప్రభుత్వాలు పట్టించుకోని ఈ అంశాన్ని ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేష్ రెడ్డి చొరవతో సాధించారు.