AP: భోగాపురం విమానాశ్రయాన్ని అడ్డుకోవడానికి మాజీ సీఎం జగన్ ప్రయత్నాలు చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. చంద్రబాబు హయాంలో పనులు చేపట్టి పురోగతి సాధించామని తెలిపారు. ఇప్పుడేమో వైసీపీ క్రెడిట్ కొట్టేయాలని చూస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు అన్ని గమనిస్తున్నారని పేర్కొన్నారు.