BHNG: రామన్నపేటలోని మౌలాలి చిల్లా దర్గా ఉత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. మొదటిరోజు గంధం ఊరేగింపు ముతావలి, ముజావర్ ఎండీ జానిపాషా ఇంటి నుండి ప్రారంభించి ఊరేగింపుగా తీసుకెళ్లి దర్గాలో సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ గరిక సత్యనారాయణ మాట్లాడుతూ.. కుల మతాలకు అతీతంగా ఉత్సవాలను నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు.