విశాఖ జిల్లాలో అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ‘యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే’ ప్రారంభమైనట్లు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. పారదర్శకత కోసం బయోమెట్రిక్ లేదా ఈ-కేవైసీ ద్వారా జరిగే ఈ సర్వేకు ప్రజలు సహకరించి ఖచ్చితమైన సమాచారం అందించాలని ఆయన కోరారు.