BDK: కొత్తగూడెం మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్లు కనుకుంట్ల కుమారస్వామి, కనుకుంట్ల వెంకటరమణ దంపతులు, వారితో పాటు రేఖారాణి ఇవాళ హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారిని మంత్రి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.