AP Inter Exam Results Released: ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఒకేసారి ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను వెల్లడించారు. ఉదయం పదకొండు గంటలకు ఈ ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాల్లో 67 శాతం ఉత్తీర్ణత సాధించగా, రెండో సంవత్సర ఫలితాల్లో 78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
ఈ ఏడాది రెగ్యులర్, ఒకేషనల్ విద్యార్థులు కలిపి మొదటి, రెండవ సంవత్సరానికి గాను దాదాపు 10 లక్షల మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్ పరీక్షల ఫలితాలను www.bie.ap.gov.in అధికార వైబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కృష్ణా జిల్లా ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో గుంటూరు, థర్డ్ ప్లేస్లో ఎన్టీఆర్ జిల్లా ఉన్నాయి.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షా వివరాలు :
* మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరైన బాలురు 2,26,240 మంది.
* ఉత్తీర్ణత సాధించిన వారు 1,43,688 మంది.
* ఉత్తీర్ణత శాతం 64%.
* మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షలకు హాజరైన బాలికలు 2,35,033 మంది.
* ఉత్తీర్ణత సాధించిన వారు 1,67,187 మంది.
* ఉత్తీర్ణత శాతం 71%.
* ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయి.
ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షా వివరాలు :
* ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరైన బాలురు 1,88,849 మంది.
* ఉత్తీర్ణత సాధించిన వారు 1,44,465 మంది
* ఉత్తీర్ణత శాతం 75%.
* ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరైన బాలికలు 2,04,908 మంది
* ఉత్తీర్ణత సాధించిన వారు 1,65,063 మంది
* ఉత్తీర్ణత శాతం 81%
* ద్వితీయ సంవత్సరం పరీక్షల్లోనూ బాలికలదే పైచేయి.