Priyamani : అవకాశం వస్తే ఆ హీరో కోసం అన్ని ప్రాజెక్టూలూ వదిలేస్తా: ప్రియమణి
అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు ప్రియమణి. ఓ హీరోతో పని చేసే అవకాశం వస్తే తన కోసం అన్ని ప్రాజెక్టులూ వదిలేసి వెళ్లిపోతానని అంటున్నారు. ఇంతకీ ఆమె అంతగా అభిమానించే హీరో ఎవరంటే..?
Priyamani about Sharukh Khan : సుదీర్ఘ కాలంగా తన నటనతో ఆకట్టుకుంటూ ముందుకు వెళుతున్న నటి ప్రియమణి. ఓ స్టార్ హీరోతో పని చేసే అవకాశం వస్తే తన ప్రాజెక్టులన్నీ అక్కడికక్కడే వదిలేసి వెళ్లిపోతానని అంటున్నారు. ఈ మధ్య కాలంలో సౌత్ కన్నా బాలీవుడ్లోనే ఎక్కువ సందడి చేస్తున్నారు ప్రియమణి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్‌పై తనకున్న అభిమానాన్ని ఆమె ఇలా చాటుకున్నారు.
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆమె చక్కగా రాణిస్తున్నారు. ఈ మధ్య కాలంలో జాతీయ స్థాయి అవార్డుని కూడా సొంతం చేసుకున్నారు. ఫ్యామిలీ మెన్ వెబ్‌సిరీస్, జవాన్, ఆర్టికల్ 370 వంటి చిత్రాలతో మంచి హిట్లను అందుకున్నారు. తెలుగులోనూ రీసెంట్గా భామాకలాపం అనే వెబ్ సిరీస్ సీక్వెల్‌తో అలరించారు. ప్రస్తుతం థియేటర్లలో మైదాన్ సినిమాతో ఆకట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తనకు షారూక్‌పై ఉన్న అభిమానాన్ని ఇలా వెల్లడించారు.
షారూక్‌తో కలిసి నటించే అవకాశం రావాలేగాని అన్నీ వదిలేయడానికి సిద్ధమని ప్రియమణి అన్నారు. తన చేతిలో ఉన్న ప్రాజెక్టులు వదిలేసి మరీ వెళ్లిపోతానని అన్నారు. ఆయనతో కలిసి పని చేయడం నాకు అన్నింటికంటే ముఖ్యం అంటూ చెప్పుకొచ్చారు. గతంలో చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాలో 1 2 3 4 గెట్ ఆన్ ది డాన్స్ ఫ్లోర్ సాంగ్‌లో షారుక్‌తో కలిసి ప్రియమణి చిందులేశారు. ఆ తర్వాత జవాన్ సినిమాలోనూ ఓ ముఖ్య పాత్రలో నటించి మెప్పించారు.