Neru Movie Explained: తిరువనంతపురం తుంబా పోలీసు స్టేషన్లో సీన్ ఓపెన్ అవుతుంది. స్టేషన్ కు ఫోన్ చేసింది నేనే అని ఒకతను అంటాడు. పోలీసులు బాధిత అమ్మాయి దగ్గరకు వెళ్లి స్టేట్ మెంట్ తీసుకోమని చెప్తాడు ఎస్ఐ. పోలీసులు వచ్చారు కదా ఏమన్నా తెలిసిందా అంటే చూపులేని అమ్మాయి ఎలా చెప్తుంది అని అక్కడ జనం మాట్లాడుకుంటారు. తరువాత మెడికల్ టెస్ట్ చేసిన డాక్టర్ రేప్ జరిగింది అని కన్ఫామ్ చేస్తుంది. నెక్ట్స్ లాయర్ ను కలిసి తనను ఎవరో బలవంతం చేశారని సారా చెప్తుంది. మరో సీన్లో పోలీసులు ఇంటికి వస్తారు. వాళ్ల అమ్మాయి ఒక విగ్రహం చేస్తుంది. దాన్ని చూపిస్తుంది. చూపులేకుండా ఇది ఎలా సాధ్యం అంటే, తను ఒక స్కిల్ స్కల్ ప్చర్ ఆర్టిస్ట్ అని, తనపై రేపు జరిగే సమయంలో అతని ఫేస్ ను వేళ్లతో తడిమాను అని సారా చెప్తుంది. ఇలాంటి వ్యక్తిని ఎక్కడైనా చూశారా అని పోలీసు సారా తండ్రిని అడుగుతాడు. ఇలాంటి వ్యక్తిని పక్కింట్లో ఒక్క సారి చూశానని సారా తండ్రి మహ్మాద్ చెప్తాడు. అతను మైకల్ అని అతన్ని పోలీసులు వెతుకుతూ, ఎయిర్ పోర్ట్ లో అరెస్ట్ చేస్తారు. తరువాత ముంబాయిలో నివసించే ప్రముఖ వ్యక్తి క్రిస్టఫర్ జోసఫ్ కుమారుడే మైకల్ జోసఫ్ అని వార్తలల్లో చెబుతుంటారు. అవే వార్తలు వింటూ బాధిత అమ్మాయి బంధువులు మహ్మాద్ ను, సారాను తిడుతుంటారు.
చదవండి:SSMB 29: ‘మహేష్-రాజమౌళి’ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో?
మరో సీన్లో క్రిస్ట్రఫర్ జోసఫ్ ఫ్లైట్ లో వస్తారు. తన కొడుకును చూడడానికి జైల్ కు వెళ్తారు. కొన్ని రోజులు ఇక్కడే ఉండనీయు అని వాళ్ల తండ్రి చెప్పడంతో మైకల్ వెళ్లిపోతాడు. అక్కడే ఉన్న తన తల్లి మైకల్ ను ఈ కేసునుంచి తప్పించు అని భర్తతో అంటుంది. తరువాత అడ్వకేట్ రాజశేఖర్ కావాలి అని క్రిస్టఫర్ చెప్తాడు. కట్ చేస్తే అడ్వకేట్ రాజశేఖర్, తన కూతురు పూర్ణిమతో పాటు వచ్చి పరిచయం చేసుకుంటాడు.
మరోసీన్లో ఈ కేసు నుంచి ఎలా బయటపడాలి అని మాట్లాడుకుంటారు. ఈ లాంటి కేసులో బెయిల్ దొరకదు, అని అందుకే సెటిల్ మెంట్ చేద్దామంటాడు రాజశేఖర్. ఈ అమ్మాయి తండ్రి మొదటి భార్యకు ఇద్దరు కొడుకులు ఉన్నారు, వాళ్లతో మాట్లాడుదాం అని వాళ్లను పిలిపిస్తారు. సెటిల్ చేయమని చెప్తారు. తరువాత సీన్లో ఆ ఇద్దరు కొడుకులు వచ్చి వాళ్ల నాన్నతో మాట్లాడుతారు. సారాకు న్యాయం చెద్దామని, డబ్బులు తీసుకొని సెటిల్ అవుదామని మాట్లాడుతారు. మీ సలహాలు వద్దని వాల్లను బయటకు వెళ్లిపోమ్మంటాడు మహ్మాద్. మరో సీన్లో రాజశేఖర్, క్రిస్టఫర్ మాట్లాడుతూ సారా అన్నలతో మాట్లాడి మీడియాను రప్పించండి అని అంటాడు. మహ్మాద్ కు పోలీసు కాల్ చేసి కొప్పడుతాడు. ఇదంతా ఎందుకు చేశారు. అసలే ముద్దాయి తరుఫున వాదించేది లాయర్ రాజశేఖర్ అని అంటాడు.
తరువాత సీన్లో కోర్టుకు అందరూ లాయర్లు ఎంతో ఆసక్తిగా వస్తుంటారు. జడ్జీ వచ్చి రాజశేఖర్ కు శుభాకాంక్షలు చెప్తాడు. తరువాత కేసు గురించి మాట్లాడుతూ… చిన్నప్పటి నుంచి ఏం చూడని అమ్మాయి రేప్ చేసిన వ్యక్తిని ఎలా కనిపెట్టగలదు అని రాజశేఖర్ అంటాడు. డిఫెన్స్ లాయర్ మాట్లాడుతూ తడబడుతాడు. సరైన ఎవిడెన్స్ లేవని రాజశేఖర్ బెయిల్ ఇవ్వాలని చెప్తాడు. దాంతో మైకల్ కు బెయిల్ వస్తుంది. ఇది ఫేక్ కేస్ అని బెయిల్ వస్తుందని ముందే తెలుసు అని క్రిస్టఫర్ తో రాజాశేఖర్ అంటాడు. సారాతో ఫైట్ చేద్దాం, బాధ పడకు అని తండ్రి మహ్మాద్ అంటాడు. తరువాత సీన్లో మైకల్ తో రాజశేఖర్ మాట్లాడుతాడు. అంతా నిజమే చెప్పాలి అని అంటాడు. ఇదే విషయాన్ని తన కూతురు పూర్ణిమ చెబుతాడు. ఇలాంటి వాడిని కాల్చిపడేయాలి అని పూర్ణిమ అంటుంది.
మరో సీన్లో పోలీసు మహ్మాద్ తో మరో వకీల్ ను పెట్టుకోవాలని చెప్తాడు. మహ్మాద్ ఒక లాయర్ ను కలిస్తే తాను బిజీగా ఉన్నాను అని ఈ కేసు హ్యాండిల్ చేయలేను అని అంటాడు. మహ్మాద్ వెళ్తిపోతుంటే లాయర్ దగ్గర పనిచేసే వ్యక్తి వచ్చి ఇదంతా రాజశేఖర్ చేపిస్తున్నారు. ఇకపై ఏ లాయర్ కేసును డీల్ చేయరు అని అంటారు. ఇదే విషయాన్ని మహ్మాద్ తన వైఫ్ తో మాట్లాడుతుంటే లాయర్ సుధీర్ వచ్చి మీ అమ్మాయితో ఒక సంతకం పెట్టించండి అని, ఆపై అంతా నేను చూసుకుంటా అంటాడు. కానీ మహ్మాద్ అతన్ని నమ్మడు ఒక రోజు టైమ్ కావాలంటాడు.
మరో సీన్లో పోలీసు మహ్మాద్ కు ఫోన్ చేసి ఎవరిని పడితే వాడిని నమ్మొద్దు అని చెప్తాడు. నెక్ట్స్ అహానా వచ్చి తప్పుడు సాక్ష్యం కోసం ఒక ఆవిడను ఒప్పించి వెళ్తుంది. అదే సమయంలో అక్కడికి సీఐ పాల్ వర్గీస్ వచ్చి ఆ లేడీతో మాట్లాడుతాడు. నీ ఫ్రెండ్ విజయ్ మోహాన్ తో మాట్లాడాలి అంటాడు. ఏంటి విషయం అంటే ఒక కేసు గురించి మాట్లాడాలి అని చెప్తాడు.
కట్ చేస్తే విజయ్ మోహాన్ ఇంటికి వెళ్తారు. అతను పడుకొని ఉంటాడు. అతన్ని అహానా నిద్ర లేపి సారా కేసు గురించి చెప్తుంది. కానీ విజయ్ ఇప్పుడు ప్రాక్టీస్ చేయడం లేదని, నా వల్ల కాదని చెప్తాడు. రాజశేఖర్ మన అపొనెంట్ అని, అతని వలనే కదా మీరు ఈ స్థితిలో ఉన్నారు అంటే.. ఎవరిమీద నాకు పగలేదు అని విజయ్ మోహాన్ అంటాడు. నాతో ఒక్క సారి వస్తారా అని అహానా అంటుంది. కట్ చేస్తే సారా ఇంటికి వస్తారు. సారాతో మాట్లాడమంటే తనకు ఇష్టం లేదని చెప్పేలోపే అందరూ సారాతో మాట్లాడమంటారు. నేను ప్రాక్టీస్ చేయడం మానేసి చాలా రోజులు అవుతుంది. నేను ఏం చేయలేను అని చెప్తాడు. తన పరిస్థితిని కూడా కొంచెం ఆలోచించండి, నేను కచ్చితంగా దీని నుంచి బయట పడాలి, నాతో తప్పుగా ప్రవర్తించిన వాడికి భయపడను అని, మీ పరిస్థితి అర్థం అవుతుంది. మీరు నిజాయితీ పరుడు అని సారా ఎమోషనల్ గా అంటుంది.
తరువాత విజయ్ బయటకు వచ్చి తన ఫ్రెండ్స్ తో కార్లో వెళుతూ అమ్మాయి ఓడిపోవద్దనే ఈ కేసు ఒప్పుకోవడం లేదని అంటాడు. మీరు ఇలా ఆలోచిస్తారు కాబట్టే ఈ కేసును మీరు టేకప్ చేయాలని అహానా అంటుంది. తరువాత మహ్మాద్ అహానా, వర్గీస్ లను లాయర్ విజయ్ గురించి అడుగుతాడు. రాజశేఖర్ శిష్యుడే ఈ విజయ్ మోహాన్, అతని దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అతని కూతరు పూర్ణమతో లవ్ లో పడ్డాడు. అది నచ్చక విజయ్ పై రాజశేఖర్ కుట్రపన్నారు. తనను బార్ కౌన్సిల్ 5 సంవత్సరాలు రద్దు చేసింది. అదే సమయంలో పూర్ణిమ పెళ్లి చేసేశాడు. ఇక అప్పటి నుంచి విజయ్ మోహాన్ ప్రాక్టీస్ చేయడం లేదు కానీ చాలా మంది లాయర్లుకు సలహాలు ఇస్తుంటారు అని చెప్తుంది.
మరోసీన్లో విజయ్ మోహాన్ ఒక కేసు గురించి లాయర్ తో మాట్లాడుతుంటాడు. అదే సమయంలో ఇది పక్క ఫ్రాడ్ కేసు అని కేవలం డబ్బుల కోసమే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేశారు అని అంటాడు లాయర్ రాజశేఖర్. తరువాత సారా కేసును స్డడీ చేస్తుంటాడు విజయ్, సరైన సాక్ష్యాలు మన దగ్గర లేవని మాట్లాడుకుంటారు. కేసు హ్యాండిల్ చేసినందుకు కోర్టు కారు పంపించినా వద్దంటాడు విజయ్. స్కల్ ప్చర్ ఫోటోలో లేవని అడుగుతాడు. నెక్ట్స్ కోర్టుకు విజయ్ హాజరు అవుతాడు. అక్కడే అహానా తన చెల్లెను జూనియర్ గా జాయిన్ చేస్తుంది. అదే సమయంలో రాజశేఖర్ తన కూతురితో వచ్చి విజయ్ ని చూస్తాడు.
కోర్టులో సెషన్ స్టార్ట్ అవుతుంది. మొదట సారా వాళ్ల ఇంట్లో పనిచేసే సీమను పిలుస్తారు. ఆ రోజు ఏం జరిగిందో చెప్పమని విజయ్ అడుగుతాడు. సారా వాల్ల అమ్మనాన్న పెళ్లికి వెళ్లారు. అదే సమయంలో తాను బ్యాంక్ కు వెళ్లిందని, ఇంట్లో సారా ఒంటరిగా ఉందని చెప్తుంది. ఇంటికి వచ్చి చూస్తే సారా భయంతో వణికిపోతుందని, తననే ఎవరో ఏదో చేశారని బయటకు వచ్చి పక్కింట్లో వాల్లకు చెప్పానని చెప్తుంది. మహ్మాద్ సర్ ఫోన్ కలువలేదని, దాంతో పోలుసులకు ఫోన్ చేసినట్లు చెప్తుంది.
తరువాత రాజశేఖర్ క్రాస్ ఎగ్జామిన్ చేస్తాడు. సీమను కన్ఫ్యూజ్ చేస్తాడు. ఇంట్లోకి ఎవరన్నా వెళ్లే అవకాశం ఉంది కదా, మైకల్ అని ఎలా చెప్పగలకు, నువ్వు పోలీసులుకు సమాచారం ఇచ్చినందుకు నిన్ను తిట్టారు కదా అని అంటాడు. అలా సీమను రాజశేఖర్ కన్ ఫ్యూజ్ చేస్తాడు.
నెక్ట్స్ పర్విన్ ను క్వశ్చన్ చేయాలని ఇన్ కెమెరా కావాలి అంటాడు విజయ్. జడ్జీ అందరిని బయటకు పంపిస్తాడు. ఆ బోనులో ఉన్న పర్సన్ ను మీరు చూశారా అంటే… అతన్ని చూసి శుక్రవారం తాను పెళ్లికి రాలేనని సారా మాతో చెప్తున్నప్పుడు అతను మా ఇంటికి వచ్చాడు అని అంటుంది. అంటే మీరు మాట్లాడుకున్న విషయం అతను విన్నాడు అని విజయ్ అంటాడు. దానికి రాజశేఖర్ అడ్డు పడుతాడు. దానికి విజయ్ వారిస్తాడు. తరువాత క్రాస్ ఎగ్జామినేషన్ కోసం రాజశేఖర్ పర్విన్ తో మాట్లాడుతాడు. మీకు ఇద్దరు భర్తలు ఉన్నారు, మహ్మాద్ డబ్బు ఉన్నవాడు అని తెలిసే అతన్ని పెళ్లి చేసుకున్నావు అని అంటాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి నువ్వే నీ కూతుర్ని అతనికి ఎర వేశావు అని అంటాడు. దాంతో పర్విన్ ఏడుస్తుంది.
తరువాత మహ్మాద్ ను పిలిచి సారాకు నిజమైన తండ్రివి నువ్వేనా అంటే కాదు అంటాడు. అయితే సీమను బ్యాంక్ కు పంపించి, నీ భార్యను పెళ్లికి పంపించి నువ్వే, నువ్వు పెంచుకుంటున్న కూతుర్ని పాడు చేశావు అని అంటాడు. దాంతో మహ్మాద్ ఏడుస్తాడు.
తరువాత సారాతో విజయ్ మోహాన్ మాట్లాడుతాడు. అసలు కోర్టులో తెలివిగా ఎలా మాట్లాడాలో, సరైన సమాధానాలు చెప్పాలని చెప్తాడు. సారా కోర్టులో నిలబడుతుంది. తనకు 12 ఏళ్ల వయసులో కళ్లుపోయాయి అని, తను స్కల్ ప్చర్ ఆర్టిస్ట్ అని చెప్తుంది. ఆరోజు ఎం జరిగిందంటే.. వాళ్ల అమ్మనాన్న పెళ్లికి వెళ్లారు, పని చేసే అక్క బ్యాంక్ కు వెళ్లింది. స్నానం చేసి బయటకు రాగానే ఎవరో నా టవల్ ను లాగేసి, బెడ్ పై పడేశారు అని చెప్తూ ఎమోషనల్ అవుతుంది.
తరువాత క్రాస్ ఎగ్జామమినేషన్ కోసం రాజశేఖర్ అడుగుతాడు. నీకు స్కల్ ప్చర్ ఆర్ట్ నేర్పించింది మీ నాన్నే కదా, అతను నీకు ఎలా నేర్పించాడు. ముట్టుకున్నాడా అంటే విజయ్ అబ్జెక్షన్ చెప్తాడు. తరువాత వాళ్ల నాన్నను ఇరికించాలని రాజశేఖర్ చూస్తాడు. తరువాత రేప్ జరుగుతుంటే అరవాల్సింది పోయి అతని మొహం తడిమి చూడడం ఏంటంటే ప్రాణ బయంతో అని చెప్తుంది. ఇలాంటి కేసు నేను చూడాలేదు, ఒక రేప్ కు గురైన అమ్మాయి ఇలా చెప్పగలదా అంటే, ఈ కాలం అమ్మాయిలు చాలా మారిపోయారు. ఏదైనా చెప్పగలరు, దేనిని భయపడరు అని విజయ్ మోహన్ అరుస్తాడు. ఇక క్వశ్చన్స్ ఏమి లేవని రాజశేఖర్ అంటాడు.
తరువాత సోషల్ మీడియాలో దీని గురించి చర్చ నడిపించాలి అని అహానా అంటుంది. నెక్ట్స్ రాజశేఖర్ ఇంట్లో కూర్చొని ఏదో ఆలోచిస్తుంటే అక్కడికి పూర్ణిమ వచ్చి టెన్షన్ పడకండి అని చెప్తుంది. మరో సీన్లో విజయ్ కోర్టుకు వస్తాడు. వినోద్ సాక్ష్యం చెప్తా అని విజయ్ తో చెప్పి, కోర్టులో డేట్ తప్పు చెప్పి మైకల్ కు హెల్ప్ చేస్తాడు. సోషల్ మీడియాలో చర్చ సాగుతుంది. చాలా మంది అమ్మాయి తరఫున, ఇంకొంత మంది అబ్బాయి తరఫున మాట్లాడుతారు.
తరువాత మైకల్, వినోద్ తో మాట్లాడుతుతాడు, అక్కడి నుంచి వినోద్ వెళ్లిపోగానే మైకల్ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది. ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్తుంది. దాంతో సోషల్ మీడియో ఓపెన్ చేస్తే సెంట్రల్ మినిస్టర్ కూతుర్ని పెళ్లి చేసుకుంటే మాత్రం శిక్షించరా అని, అలాంటి వాడిని కాల్చేయాలని అంటుంటారు. సారా ఫ్యామిలీ డిన్నర్ చేస్తుంటే అదే సమయంలో మైకల్ సారా ఇంటికి వస్తాడు. డబ్బు తీసుకొని అన్ని ఆపేయండి అని బెదిరిస్తాడు. లేదంటే మీ ముగ్గురిని నిలువునా తగలబెట్టేస్తాను అని వెళ్లిపోతాడు. సారాను పట్టుకొని వాళ్లు ఏడుస్తారు.
మరో సీన్లో మైకల్ చేసింది రాంగ్ అని రాజశేఖర్, వాళ్ల ఫాదర్ మాట్లాడుతుంటారు. నెక్ట్స్ హీయరింగ్ కు పూర్ణిమను వెళ్లమని రాజశేఖర్ అంటాడు. పూర్ణిమ ఓకే అంటుంది. నెక్ట్స్ సీన్లో కోర్టులో సెషన్ స్టార్ట్ అవుతుంది. కేవలం మైకల్ కు బెయిల్ క్యాన్సెల్ చేయాలనే అతను వాళ్లింటికి వెళ్లాడనే డ్రామా ఆడుతున్నారని పూర్ణిమ అంటుంది. అతను బయట ఉంటే సారాకు ప్రమాదం అని విజయ్ అంటాడు. అలాగైతే సారా ఇంటికి సెక్యూరుటీ ఇవ్వాలని జడ్జీ అంటాడు.
తరువాత డాక్టర్ ను పిలిచి విచారిస్తారు. రేప్ చేస్తే శరీరంపై గాయాలు, గాట్లు ఉండాలి అవేమన్నా ఉన్నాయా అంటే లేదు అంటుంది. సీమెన్ ఏదైనా దొరికిందా అంటే లేదు అంటుంది. తరువాత పోలీసులను విచారిస్తే అతను కల్ ప్చర్ బొమ్మను ఫోటోలు తీశానని, స్టేషన్లో పెట్టిన తరువాత అవి కనిపించడం లేదని చెప్తాడు. మరో ఆఫీసర్ వచ్చి అలాంటి ఫోటోలు ఏమి లేవని చెప్తాడు.
నెక్ట్స్ సీన్లో సారా బొమ్మను తయారు చేస్తూ ఫ్రస్టేట్ అవుతుంది. దాన్ని తానే పాడు చేస్తుంది. మరో సీన్లో కోర్టులో హీయరింగ్ నడుస్తుంది. మైకల్ ను జడ్జీ విచారిస్తారు. అమ్మాయి కేసులో అతను నిరపరాది అంటాడు. అదే రోజు తన ఫ్రెండ్ ఇంటి నుంచి పార్టీకి వెళ్లి, అక్కడినుంచి ఎయిర్ పోర్ట్ కు వెళ్లినట్లు చెప్తాడు. ఎయిర్ పోర్ట్ లో నే అతన్ని పోలీసులు అరెస్ట్ చేసినట్లు చెప్తాడు. కేసు వాయిదా పడుతుంది. ఆ రోజు రాజశేఖర్ వస్తున్నారని పూర్ణిమ చెప్తుంది.
మరో సీన్లో మైకల్ ట్రావెల్ చేసిన లొకేషన్ ట్రేజ్ చేయమని, టవర్ లోకేషన్ డిటైల్స్ కావాలని, ఈ విషయంలో ఎస్ఐ వర్గీస్ సాయం తీసుకొమని అహానాకు విజయం చెప్తాడు. అలాగే అతని ఫ్రెండ్ తో పాటు హోటల్లో భోజనం చేశాడు అని చెప్తున్నాడు కదా, మైకల్ ఫ్రెండ్ నవీన్ డిటైల్స్ కూడా కావాలని చెప్తాడు. అహానా రిసార్ట్ లో కూడా వెతుకుతుంది. నెక్ట్స్ హోటల్ కు వెళ్లి సీసీ కెమెరా గరించి అడిగితే అది కరాబ్ అయిందని చెప్తాడు. అదే విషయాన్ని విజయ్ కి చెప్తుంది.
తరువాత సీన్లో కోర్టులో నవీన్ ను విచారిస్తారు. అతనికి మైకల్ తెలుసు సంఘటన జరిగిన రోజు తన మైకల్ ని చూసినట్లు తన ఫ్రెండ్స్ తో రిసార్ట్ కు వెళ్లినట్లు చెప్తాడు. క్రాస్ ఎగ్జామిన్ చేస్తారా అని విజయ్ ని అడిగితే లేదు అని ఆ హోటల్ సీసీ ఫుటేజ్ ఎందుకు సబ్మిట్ చేయలేదు అని అడుగుతాడు. దానికి జడ్జీ సీసీ ఫుటేజ్ కావాలి అని చెప్పి కోర్టును వాయిదా వేస్తాడు.
తరువాత సీన్లో సారా గదిలో తన అమ్మ పర్విన్ బట్టలు సర్ధుతుంటే సారా వస్తుంది. ఇంట్లో ఎవరో ఉన్నారని బయపడుతుంది. దాంతో సారా తల్లి తనకు ధైర్యం చెబుతుంది. కోర్టులో హార్డ్ డిస్క్ గురించి హోటల్ వ్యక్తిని హాజరు పరుస్తారు. సీసీ ఫుటేజ్ ను విజయ్ తీసుకొస్తాడు. ప్లే చేసి చూస్తారు. అందులో ఏ తప్పు కనిపించదు. మైకల్ తన ఫ్రెండ్ హోటల్ కు వెళ్లినట్లు రికార్డు అవుతుంది. దాంతో విజయ్ అహానా వైపు చూస్తే అహానా షాక్ అవుతుంది. మైకల్ నవ్వుతాడు. విజయ్ ఆలోచనలో పడుతాడు. తరువాత అహానాను మాట్లాడొద్దు అని అంటాడు. కట్ చేస్తే విజయ్ ఇంటికి వెళ్లి నీతో మాట్లాడాలి అని ఇందులో నా తప్పు ఏమి లేదు అని అంటుంది. ఇదంత రాజశేఖర్ వ్యూహం అని అంటాడు. అహానా సారీ చెప్తుంది. ఇప్పుడు ఏం చేయబోతున్నాము అని అహానా అడుగుంది. ఆ సీసీ ఫుటేజ్ ని మరోక్కసారి చూడాలి అంటాడు.
విజయ్ సీసీ టీవీ ఫుటేజ్ చూస్తాడు. సారా నమాజ్ చదువుతుంది. విజయ్ కి క్లూ దొరుకుతుంది. దాంతో హోటల్ అతని దగ్గరకు వెళ్లి నిజం చెప్పు అంటాడు విజయ్. దాంతో అతను నిజం చెప్తాడు. తరువాత కోర్టులో అతన్ని ప్రవేశపెడుతారు. నన్ను బయపెట్టి అలా చేయించారు అని చెప్తాడు. సీసీ టీవీ ఫుటేజ్ ప్లే చేస్తారు. అందులో ఒక పాత్ర సడెన్ గా అదృష్యం అవుతుంది. సో మైకల్ తన ఫ్రెండ్ హోటల్ కు వచ్చిన సమయాన్ని మార్చారు అని చెప్తాడు. సీసీటీవీ ఫుటేజిని ఎడిట్ చేశారు అని అంటాడు. దాంతో రాజశేఖర్ హోటల్ అతన్ని శిక్షించాలని అంటాడు. దానికి విజయ్ ఆగమని మరో సీసీ ఫుటేజ్ ఉందని అంటారు. ఆ సీసీటీవీలో రాజాశేఖర్ అతన్ని బెదిరించి తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేసినట్లు చెప్తాడు. దాంతో జడ్జీ అతనిపై బారు కౌన్సిల్ కు రిపోర్ట్ చేయాలని చెప్తాడు.
సారాకు న్యాయం జరుగాలని అన్ని మీడియా ఛానెళ్లు మాట్లాడుతుంటాయి. అదే సమయంలో రాజశేఖర్ తప్పు గురించి మాట్లాడుతారు. బార్ కౌన్సిల్ లో లాయర్లు కూడా అదే విషయం గురించి మాట్లాడుతారు. మరో కోర్టు హీయరింగ్ లో తన కూతురు పూర్ణిమ వాదిస్తుందని అంటారు. సీసీటీవీని తప్పుడు సాక్ష్యంగా చూపించడం అంటే తప్పు చేశారనే కదా అని విజయ్ మోహాన్ అంటాడు. అలా ఎలా నిర్ధారిస్తాము. ఇంకా వాదనలు ఉన్నాయి అని పూర్ణిమ అంటుంది. అదే సమయంలో అహానా బయటకు వెళ్లి ఒక వ్యక్తిని కోర్టులోకి తీసుకొని వస్తుంది. అతన్ని బోనులో నిలబెడుతారు. అది కొత్త ఎవిడెన్స్ అని పూర్ణిమ అంటుంది. రాబిన్ వచ్చి కోర్టులో నిలబడుతాడు. అతను సీజే గ్రూప్ లో డ్రైవర్ అని చెప్తాడు. ఇతను మైకల్ మనిషి అని జడ్జీ అంటాడు. అయినా విచారిస్తాడు విజయ్. ఆ సంఘటన జరిగిన రోజు ఎక్కడున్నావు అంటే ఇంట్లో ఉన్నా అని అబద్దం చెప్తాడు. తరువాత ఒక కారును నడిపావని అందులో నువ్వు ఉన్నావని అంటాడు. దానికి రాబిన్ నేను ఏ కారు నడపలేదు అని చెప్తాడు. రాబిన్ మొత్తం అబద్దం చెప్తాడు. తరువాత పూర్ణిమ అతన్ని విచారించి అతనికి మతిమరుపు ఉందని, మొబైల్ మరిచిపోతాను, ఆ రోజు కార్లులో తన మొబైల్ మరిచిపోయాను అంటాడు. తరువాత కోర్టు వాయిదా వేయమని విజయ్ అంటే కుదరదు అని జడ్జి చెప్తాడు.
రాబిన్ కారు నడిపినట్లు నిరుపిస్తే చాలని విజయ్ అహానా, పోలీసులతో చెప్తాడు. ఈ కేసులో విజయ్ కి ఇంకేదైనా క్లూ దొరుకుతుందా అని పూర్ణిమ తన తండ్రిని అడుగుతుంది, ఛాన్స్ లేదని రాజశేఖర్ అంటాడు. తరువాత విజయ్ సీసీ టీవీని పరీశిలిస్తాడు. అహానా కాల్ చేసి ఒక విషయం చెప్తాడు. తరువాత రోజు కోర్టులో విచారణ జరుగుతుంది. మైకల్ స్నేహితులు బోనులో నిలబడుతారు. ఆ రోజు రిసార్ట్ కు వచ్చినట్లు వారు చెప్తారు. ఏదైనా క్రాస్ ఎగ్జామిన్ చేస్తారా అని జడ్జీ అడిగితే తరువాత చేస్తా అంటాడు. అలా ముగ్గురిని విచారించిన తరువాత చివరిగా రిసార్డ్ ఓనర్ ను కూడా విచారిస్తే అతను కూడా మైకల్ రిసార్ట్ కు వచ్చినట్లు చెప్తాడు. ఇతన్ని ఏమైనా క్వశ్చన్ అడుగుతారా అంటే విజయ్ అతన్ని విచారిస్తాడు. సీసీ కెమెరాలు ఎందుకు లేవంటే అవసరం లేదని చెప్తాడు. నెక్ట్స్ అహానా కోసం అడిగితే తన జూనియర్ లాయర్ ఇంకా రాలేదని చెప్తుంది. తరువాత మైకల్ ఫ్రెండ్స్ ను విచారించాలని, ఒక్కొక్కరిని మాత్రమే విచారిస్తా అని అంటాడు.
మైకల్ ఏ కార్లో వచ్చాడు. ఆ కారు కలర్ ఏంటి, అతను ఏ డ్రెస్ వేసుకున్నాడు అని ప్రశ్నలతో వాళ్లను తికమక పెడుతాడు విజయ్. దానికి పూర్ణిమ అడ్డు చెప్తుంది. తరువాత మరో ఫ్రెండ్ ను అడిగితే అతను తడబడుతాడు. నెక్ట్స్ ఫ్రెండ్ ఏది గుర్తుకు లేదని చెప్తాడు. తరువాత ఓ లేడీని ప్రశ్నిస్తాడు. తన చాలా ఇబ్బంది పడుతుంది. ఒక అమ్మాయిని మైకల్ దారుణంగా రేప్ చేశాడు. నువ్వు చెప్పే సాక్ష్యంపై తీర్పు ఆధారపడిం ఉంది అంటాడు విజయ్. దాంతో తను ఎమోషనల్ అవుతుంది. తరువాత హస్బెండ్ పై కొప్పడుతుంది. అదే సమయంలో అహానా పెన్ డ్రైవ్ తీసుకొని వస్తుంది. దాన్ని పూర్ణిమ ఒప్పుకోదు. రాబిన్ సాక్ష్యం తప్పు అని విజయ్ వాదిస్తాడు. దాన్ని జూమ్ చేసి చూస్తే అక్కడ రాబిన్ ఉంటాడు. అప్పుడెప్పుడో జరిగిన సంఘటన దీన్ని బట్టి ఎలా నిర్దారిస్తారు అని పూర్ణిమ అంటుంది. మైకల్ టెన్షన్ పడుతాడు. తరువాత ఇదే మైకల్ పై ముంబాయిలో ఒక రేపు కేసు కూడా ఉందని ఒక ఎఫ్ఐఆర్ ఇస్తాడు విజయ్. అందరూ షాక్ అవుతారు. రెండు కేసుల్లో ఒక్కడే నిందుతుడు అని, అతనికి ఇలాంటి క్రైమ్ చరిత్ర ఉందని చెప్తాడు. దాంతో కోర్టు చెప్పనంత వరకు అతను దోషి కాడు అని పూర్ణిమ అంటుంది.
కేసు గెలిచినట్లే కదా అని మహ్మాద్ అంటాడు. కానీ విజయ్ అది కచ్చితంగా చెప్పలేము అని అంటాడు. ఈ కేసులో మనకు ఒక ఐ విట్నేస్ ఉంటే బాగుండూ అని విజయ్ అంటాడు. అయితే ఈ కేసు గెలవలేమా అని మహ్మాద్ బాధపడుతాడు. లాస్ట్ హీయరింగ్ రోజు ఒక పని చేస్తా చూద్దాం ఏం జరుగుతుందో అని విజయ్ అంటాడు. కోర్టులో కేసు నడుస్తుంది. ఇది సాధారణమైన కేసు కాదని, నిందుతుడు చాలా తెలివిగా చేశాడని విజయ్ చెప్తాడు. మైకల్ తన పెళ్లికి పిలవడానికి తన ఫ్రెండ్ ఇంటికి వస్తాడు. తన స్నేహితుడి ఇళ్లు కనుక్కునే క్రమంలో సారాను చూస్తాడు. తన పేరెంట్స్, పని మనిషి ఇంట్లో ఉండరన్న విషయాన్ని తెలుసుకుంటాడు. తన కంపెనీలో పనిచేసే డ్రైవర్ కు ఫోన్ చేసి ఒక కారును తెప్పించుకొని, తన కారును, మైబైల్ ను అతనికి ఇచ్చి రిసార్డుకు పంపిస్తాడు. సారా ఒంటిరిగా ఉండడం చూసి ఇంట్లోకి వెళ్లి కండోమ్ యూజ్ చేసి తనను రేప్ చేస్తాడు. అరిస్తే చంపేస్తా అని బెదిరించడంతో సారా సైలెంట్ గా ఉండిపోయింది. ఆ సమయంలో తన నైపుణ్యంతో అతని ముఖాన్ని తడిమింది. తన రూపాన్ని ఒక స్కల్ ప్చర్ రూపంలో చేసింది. దాన్ని ఆధారంగా చేసుకొనే పోలీసులు అరెస్ట్ చేశారు. అతనే మైకల్ అని విజయ్ చెప్తాడు. చట్టం చేతుల్లోనుంచి తప్పించుకోవాడానికి చాలా ప్రయత్నాలు చేశారు కానీ చట్టం ముందు ఎవరు తప్పించుకోలేరని విజయ్ అంటాడు.
తరువాత పూర్ణిమ లేచి కథ చాలా బాగుంది అని అంటుంది. మైకల్ చేసినట్లు ఏ ఒక్క బలమైన ఆధారం లేదని అంటుంది. విక్టిమ్ బ్లైండ్, తప్పు చేసింది ఎవరో చెప్పే ఒక ఐ విట్నెస్ కూడా లేదని, అలాగే ఒక స్కల్ ప్చర్ ఆధారంగా మైకల్ దోషి అంటున్నారు. ఇంతకి తను స్కల్ ప్చర్ ఆర్టిస్ట్ అని ఎలా చెప్పగలరు అని పూర్ణిమ అంటుంది. అదే సమయంంలో విజయ్ లేచి తను ప్రొఫేషినల్ స్కల్ ప్చర్ ఆర్టిస్ట్ అని అంటాడు. కావాలంటే తనను కోర్టు పరీక్షించాలని అంటాడు. ఇది కోర్టు సమయాన్ని వృథా చేయడం అని పూర్ణిమ అంటుంది. జడ్జీ దీనిలో తప్పు ఏముంది అని అంటాడు. ఇది చరిత్రక తీర్పు అవబోతుంది అని విజయ్ అంటాడు.
జడ్జీ సారాతో మాట్లాడి తాను రెడీగా ఉందని తెలుసుకుంటాడు. ఈ కోర్టులో ఉన్న ఎవరైనా ఒకరిని సెలెక్ట్ చేద్దామంటే పూర్ణిమ లేచి, అతన్ని మేమే సెలెక్ట్ చేస్తామని, తనకు 5 మినిట్స్ మాత్రమే టైమ్ ఇవ్వాలని, ఒంటరిగా ఉండాలని అంటుంది. ఇదే విషయాన్ని మీడియా కూడా చెప్తుంది. తరువాత సారా దగ్గర రాజశేఖర్ కూర్చుంటాడు. సారా తన ఫేస్ ను తడముతుంటే, రాజశేఖర్ తనను హరాజ్ చేస్తాడు. నువ్వు ఎవ్వడికో పుట్టావు, ఎవడినో డాడీ అని పిలుస్తున్నావు ఎవడో రేప్ చేశాడు అని బాధ పెడుతాడు. అంతే కాదు నువ్వు రేపు చేసినప్పుడు బాధ పడలేదు, ఎంజాయ్ చేశావు అని అంటాడు. మీ అమ్మ బజారుది అని దారుణంగా మాట్లాడుతాడు. సారా ఏడుస్తుంది. టైమ్ అయిపోయిందని రాజశేఖర్ వెళ్లిపోతాడు.
తరువాత సారా స్కల్ ప్చర్ చేయడానికి సిద్దం అవుతుంది. కేరళలో ఒక న్యాయస్థానం రాత్రి కూడా పని చేస్తుందని మీడియాలో చెబుతుంటారు. మరో వైపు పూర్ణిమ మైకల్ ఫ్యామిలీతో మాట్లాడుతుంది. జడ్జీ అక్కడే పడుకుంటాడు. సారా విగ్రహం పూర్తి చేస్తుంది. విజయ్ నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటాడు. నెక్ట్స్ రోజు కోర్టు మొదలౌతుంది. జడ్జి వస్తాడు. సారా చేసిన బొమ్మను తీసుకొస్తారు. జడ్జి ముందు నిలబెడుతారు. రాజశేఖర్ ను పిలుస్తాడు. ఆ విగ్రహాన్ని తిప్పమని చెప్తాడు. పూర్ణిమ చూసి షాక్ అవుతుంది. విజయ్ కళ్లు చమరుస్తాడు. రాజశేఖర్ విగ్రహాన్ని చూసి షాక్ అవుతాడు.
మైకలే రేపు చేశాడని కోర్టు నమ్ముతుంది. అతని ఏ శిక్ష వేయమంటారు విజయ్ అని జడ్జి అడుగుతాడు. ఇది కచ్చితంగా ప్రతీ స్త్రీ గురించి ఆలోచించాల్సిన విషయం. ఇలాంటి వారికి జీవిత ఖైదుతో పాటు భారీ జరిమాన విధించాలని అంటాడు. దీనిపై మీరు ఏం అంటారు అని పూర్ణిమను అడిగితే, అతని వయస్సు, విద్యాను పరిగణలోకి తీసుకొని శిక్షను తగ్గించండి అని పూర్ణిమ అంటుంది.
ఈ కేసులో దోషిగా తేలినందుకు జీవిత ఖైదీతో పాటు 2 లక్షల రూపాయాలను జరిమాన విధిస్తాడు జడ్జీ. విజయ్ కి అందరూ కాంగ్రాట్స్ చెబుతారు. ఇదే విషయాన్ని మీడియా చెబుతుంది. వర్గీస్ ను, రాజశేఖర్ ను కామెంట్స్ అడుగుతారు. దీనికంటే పై కోర్టు ఉంది కదా అని రాజశేఖర్ అంటాడు. తరువాత సీన్లో మహ్మాద్ విజయ్ కు థ్యాంక్స్ చెప్పి మా అమ్మాయికి ఒక ఆశ ఉందని చెప్తాడు. సారా విజయ్ దగ్గరకు వచ్చి అతన్ని మొహాన్ని వెళ్లతో తడుముతుంది. విజయ్ ఎమోషనల్ అవుతాడు. సారా దండం పెడుతుంది. విజయ్ వెళ్లిపోతాడు. సారా తన ఫేస్ కు కట్టుకున్న క్లాత్ తీసేస్తుంది. ధైర్యంతో కోర్టు బయటకు నడుచుకుంటూ వస్తుంది. మీడియా కవర్ చేయడానికి ముందుకు వస్తారు. కానీ ఎవరు కెమెరాలు ఆన్ చేయరు. ఒకరు చేయబోతుంటే వద్దని రిపోర్టర్ వారిస్తుంది. అందరూ సారాను చూస్తారు. అహానా విజయ్ నడుచుకుంటు సాధారణంగా వెళ్లడం చూస్తుంది. లాయర్ విజయ్ మోహాన్ అలా కోర్టుబయటకు నడుచుకుంటూ వెళ్తాడు.