»Priyamani Wants To Act With Megastar Chiranjeevi 2
మెగాస్టార్ పై మనసు పారేసుకున్న ప్రియమణి, మనసులో మాట బయట పెట్టిన సీనియర్ బ్యూటీ
మెగాస్టార్ చిరంజీవి ఏడు పదుల వయస్సుకు దగ్గరలో ఉన్నా.. ఆయన క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. బాడీలో గ్రేస్ కూడా తగ్గలేదు. ఇప్పటికీ అదేజోరుతో హుషారుతో స్టెప్పులేస్తున్నాడు చిరంజీవి. ఆయనతో ఒక్క సినిమా చేస్తే చాలు అనుకునే హీరోయిన్లు చాలా మంది ఉన్నారు.
మెగాస్టార్ చిరంజీవి ఏడు పదుల వయస్సుకు దగ్గరలో ఉన్నా.. ఆయన క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. బాడీలో గ్రేస్ కూడా తగ్గలేదు. ఇప్పటికీ అదేజోరుతో హుషారుతో స్టెప్పులేస్తున్నాడు చిరంజీవి. ఆయనతో ఒక్క సినిమా చేస్తే చాలు అనుకునే హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. ఇక ప్రస్తుతం చాలా మంది హీరోయిన్లు ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఫామ్ లో ఉన్న తారల దగ్గర నుంచి ఫెయిడ్ అవుట్ అయిన హీరోయిన్ల వరకూ.. కొంత మంది తారలు బాహాటంగానే చిరుతో నటించాలని ఉందంటూ చెప్పేస్తున్నారు.
ఆమధ్య తమిళస్టార్ హీరోయిన్ ఖుష్బు.. చిరంజీవితో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయాలని ఉంది అంటూ.. ఓ ఇంటర్వ్యూలో చెప్పేసింది. చిరుతో స్టాలిన్ లో సోదరిగా నటించాను కాని.. హీరోయిన్ గా నటించే అవకాశం రాలేదు. ఇప్పుడు ఆ అవకాశం వస్తే మాత్రం వదిలిపెట్టను అంటూ చెప్పేసింది. తాజాగా మరో సీనియర్ హీరోయిన్ ప్రియమణి కూడా.. ఇలాగామెగాస్టార్ గురించి తన మనసులో ఉన్న మాట బయట పెట్టేసింది.