Karnataka camp politics in Hyderabad, leader booked rooms at star hotels
Karnataka:కర్ణాటకలో (Karnataka) కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించనుంది. ఎర్లీ ట్రెండ్స్‌లో ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. దీంతో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు అప్రమత్తం అయ్యారు. తమ పార్టీ నుంచి గెలిచే అభ్యర్థులను క్యాంపు కోసం తరలిస్తున్నారు. అందరినీ హైదరాబాద్ తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యేల కోసం కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత స్టార్ హోటళ్లలో రూమ్స్ బుక్ చేసినట్టు తెలిసింది.
తాజ్ కృష్ణా (taj krishna), పార్క్ హయత్, నోవాటెల్ హోటళ్లలో గదులను బుక్ చేశారని తెలిసింది. గెలిచిన అభ్యర్థులను వెంటనే కర్ణాటక నుంచి హైదరాబాద్ తరలిస్తారు. గతంలో మాదిరిగా బస్సులో (bus) తరలించే అవకాశం. 2018లో బీజేపీ 100 సీట్లు సాధించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయిలో ఎమ్మెల్యేలు లేరు. అప్పటి గవర్నర్ యడియూరప్పను పిలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరగా.. ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు తలుపు తట్టగా.. సభలో మెజార్టీ నిరూపించుకోలేక పదవీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో తిరిగి అక్కడ కమల దళం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుత కర్ణాటక ఎన్నికల ఫలితాలను కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ (sonia gandhi), రాహుల్ గాంధీ (rahul gandhi) విశ్లేషిస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ నేతలతో జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున కర్గే (kharge) టచ్‌లో ఉన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయంతో ఆ పార్టీకి బూస్టింగ్ ఇచ్చినట్టు అవుతుంది.
హైదరాబాద్ హనుమాన్ ఆలయానికి టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) వస్తుండగా.. సిమ్లాలో గల హనుమాన్ ఆలయంలో కాంగ్రెస్ ముఖ్య నేత ప్రియాంక గాంధీ (priyanka gandhi) ప్రత్యేక పూజలు చేశారు.