»Congress Workers Are Very Happy Revanth Go To Hanuman Temple
Karnatakaలో సత్తా చాటిన కాంగ్రెస్: శ్రేణుల సంబరాలు, హనుమాన్ ఆలయానికి రేవంత్
కర్ణాటకలో కాంగ్రెస్ సంపూర్ణ ఆధిక్యం సాధించనుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హనుమాన్ ఆలయానికి వెళ్లారు.
Congress Workers Are Very Happy, Revanth Go To Hanuman Temple
Karnataka:కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ (congress) తన సత్తా చాటుతోంది. మ్యాజిక్ ఫిగర్ దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 113 స్థానాల్లో విజయం సాధించాలి.. ప్రస్తుతం కాంగ్రెస్ 132 చోట్ల లీడ్‌లో ఉంది. కర్ణాటక ట్రెండ్స్ బట్టి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. న్యూఢిల్లీలో గల కాంగ్రెస్ కార్యాలయం ముందు డ్యాన్స్ (dance) చేసి జోష్ మీదున్నారు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.
ఇటు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) కాసేపట్లో హనుమాన్ ఆలయానికి వెళ్లనున్నారు. ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే భజరంగ్ దళ్‌పై నిషేధం విధిస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చేర్చింది. పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో వెనక్కి తగ్గింది. కే పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ (dk shiva kumar) దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తమ పార్టీ అధికారం చేపడితే రాష్ట్రవ్యాప్తంగా కొత్త హనుమాన్ ఆలయాలు నిర్మిస్తామని ప్రకటించారు.