సీనియర్ నటి ప్రియమణి (Priyamani)పేరు చెప్పగానే యమదొంగ సినిమానే గుర్తుకు వస్తుంది. అమాయకంగా తనదైన నటనతో అభిమానులను ఆకట్టుకుంది. పెళ్లైన కొత్తలో, గోలీమార్ (Golimar movie) చిత్రాల్లోనూ తన నటనతో మెప్పించింది. టాలీవుడ్లో స్టార్ హీరోలందరితో నటించింది ముద్దుగుమ్మ. తన కెరియర్లో ఎన్నో విమర్మలు ఎదుర్కొన్నానని నటి ప్రియమణి తాజాగా ఓ ఇంటర్వూలో తెలిపారు. బాడీ షేమింగ్(Body shaming), శరీర రంగు విషయంలో ఇప్పటికీ విమర్మలు ఎదుర్కొంటున్నాని ఆమె తెలిపారు. ఆన్లైన్ ట్రోలింగ్‌ను నేను పెద్దగా పట్టించుకోను. అయితే, ముస్తఫా(Mustafa)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు సోషల్‌మీడియా వేదికగా విపరీతమైన వ్యతిరేకత ఎదుర్కొన్నాని ప్రియమణి అన్నారు
మా నిశ్చితార్థ ఫొటోలు షేర్ చేసినప్పుడు..‘నువ్వు ఎందుకు ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నావు?’ అంటూ అభ్యంతరకరంగా దూషించారు. కామెంట్స్ చేసేవాళ్లందరికీ నేను చెప్పేది ఒక్కటే.. ఇది నా జీవితం. ఎవరితో జీవితాన్ని కొనసాగించాలనేది పూర్తిగా నా ఇష్టం’’ అని ఆమె అన్నారు. ట్రోల్స్(Trolls)కు ప్రాధాన్యత ఇచ్చి.. వాటి వల్ల బాధపడటం తనకు నచ్చదని.. అందుకే విమర్శలను ఏమాత్రం పట్టించుకోనని ఆమె తెలిపారు. 2017లో వ్యాపారవేత్త ముస్తఫారాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక.. నారప్ప
(Narappa) భామా కలాపం, విరాటపర్వం చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం షారూక్ ఖాన్ (Shah Rukh Khan) నటిస్తోన్న జవాన్‌లో కనిపించనున్నారు.