నేను కూడా బాడీ షేమింగ్ (Body shaming) బాధితుడ్నే అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్మి నారా లోకేశ్ అన్నారు. యువగళం పాదయాత్ర నెల్లూరు రూరల్ (Nellore Rural) నియోజకవర్గానికి చేరుకుంది. ఆయన అనిల్ గార్డెన్స్ లో ‘మహిళా శక్తి (Mahila sakti) తో లోకేశ్’ కార్యక్రమంలో భాగంగా మహిళలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఓ మహిళా సైకాలజిస్టు (Psychologist) మాట్లాడుతూ, మన విద్యా వ్యవస్థలో మానసిక సంక్షేమం, శారీరక సంక్షేమం అనే అంశాలను పూర్తిగా విస్మరిస్తున్నామని విచారం వ్యక్తం చేశారు. ఓ సైకాలజిస్టుగా, ఓ తల్లిగా ఈ మాటలు చెబుతున్నానని అన్నారు.
దీనివల్ల పిల్లల్లో ఆత్మన్యూనత భావం, కుంగుబాటు, బాడీ డిస్మోర్ఫియా (Body dysmorphia) వంటి సమస్యల తలెత్తుతాయని, దాంతో చిన్న వయసులోనే పిల్లలు డయాబెటిస్(Diabetes), ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపారు. ఈ అంశాలను ఇతర దేశాలు ఓ ముప్పుగా పరిగణించి చర్యలు తీసుకుంటున్నాయని ఆమె వివరించారు.చాలా దేశాలు ఫిజికల్ ఎడ్యుకేషన్ (Physical Education) సబ్జెక్టుకు కూడా ఎడ్యుకేషన్ కర్రిక్యులమ్ లో స్థానం కల్పించి, ఆ సబ్జెక్టును తప్పనిసరిగా పాస్ అవ్వాలన్న నిబంధన తీసుకువచ్చాయని ఆమె తెలిపారు. రేపు టీడీపీ (TDP) గెలిచి అధికారంలోకి వస్తే ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి, మన స్కూళ్లలో కూడా ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆమె నారా లోకేశ్(Nara Lokesh)ని కోరారు.