ఏపీలో సర్పంచులు (Sarpanculu) తలపెట్టిన ధర్నా ఉద్రిక్తతలకు దారితీసింది. ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ రాజ్ (Panchayati Raj) కమిషనర్ కార్యాలయం ముట్టడికి యత్నించారు.ఈ నేపథ్యంలో కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి సర్పంచుల ఆందోళనకు దిగారు. దీంతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది సర్పంచులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. పోలీసుల (police)వైఖరిపై సర్పంచులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘హక్కుల కోసం పోరాడుతుంటే అరెస్టు చేస్తారా? రావాల్సిన బకాయిలు, నిధులు వెంటనే విడుదల చేయాలి.
20 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం స్పందించట్లేదు. నిధులు (funds) లేక గ్రామాల్లో రోడ్లు కూడా వేయలేని దుస్థితి ఏర్పడింది. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం (State Govt) వాడుకున్న నిధులు పంచాయతీ ఖాతాల్లో వేయాలి’’ అని సర్పంచులు డిమాండ్ చేశారు. అనంతరం నిధుల విడుదలకు సంబంధించి ఆందోళనలు చేస్తున్న సర్పంచులు పంచాయతీ కమిషనర్‌ను కలిసి వినతి పత్రం అందించారు. రాష్ట్రానికి సీఎం జగన్ (CM JAGAN) గ్రామానికి మేమే అని వారు అన్నారు. వాలంటీర్లకు వచ్చే జీతం కూడా సర్పంచ్‌లకు లేదు. నిధులు లేకుండా లక్షల్లో ఎలా ఖర్చు చేయాలని అని సర్పంచ్ల సంఘం అధ్యకుడు పాపారావు (Paparao) ప్రశ్నించారు.