Pawan Kalyan: ఏపీకి విముక్తి కల్పించడమే నా బలమైన లక్ష్యం
ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ఏర్పడింది. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు.
Pawan Kalyan: ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ఏర్పడింది. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. ఏపీకి జగన్ పాలన నుంచి విముక్తి కల్పించాలన్నదే బలమైన లక్ష్యమని పవన్ అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతు నష్టాల్లో ఉన్నాడని, గంజాయి పండించే వైసీపీ నేతలు లాభాల్లో ఉన్నారని తెలిపారు. ద్వారంపూడి కుటుంబం దోచుకోవడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. దశాబ్ద కాలం నుంచి తనను చాలా రకాలుగా ఇబ్బందిపెట్టారని, ప్రజాసంక్షేమం కోసం ఎన్ని ఇబ్బందులైన ఎదుర్కొంటానని పవన్ తెలిపారు.
పట్టాదారు పాస్‌పుస్తకాలపై ఆంధ్రప్ర్రదేశ్ రాజముద్ర ఉండాలి. ప్రధానిగా మోదీ ఉన్నారని పాస్‌పోర్టుపై ఆయన ఫొటో లేదు కదా? అన్నారు. వైసీపీకు ఓటు వేస్తే ప్రజల ఆస్తులు గాలిలో దీపమే అన్నారు. మన ఆస్తి పత్రాలపై జగన్ హక్కు ఏంటని నిలదీయాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే గంజాయి వాళ్లను ఏరిపారేద్దాం. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేస్తాం. దళారుల దోపిడీ అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు చేపడతామని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. కేంద్రం నుంచి వచ్చే నిధులను పంచాయతీలకే కేటాయిస్తామని పవన్ తెలిపారు.