»Not Knowing That His Father Died The Son Cried All Night And Slept Next To The Dead Body At Nizamabad
Nizamabad: తండ్రి మరణించాడని తెలియక..రాత్రంతా శవం పక్కనే ఏడ్చిన పిల్లాడు
నిజామాబాద్ సదాశివనగర్ మండలం దగ్గి అటవీప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి గురైన తండ్రీకొడుకులు. తండ్రి మరణించాడని తెలియక రాత్రంతా వెక్కి వెక్కి ఏడ్చి సృహతప్పి పడిపోయిన బాలుడు(child). స్థానిక ఎమ్మెల్యే బాధిత కుటుంబాన్ని పరామర్శించడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Nizamabad: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి(Indalwai) మండలం వెంగల్పాడ్ గ్రామంలో హృదయవిదారక ఘటనొకటి చోటుచేసుకుంది. బైక్ పై వస్తున్న తండ్రీకొడుకులు ఇద్దరు ప్రమాదానికి(Accident) గురయ్యారు. ఈ ప్రమాదంలో తండ్రి మరణించాడని తెలియక మూడేళ్ల కొడుకు వెక్కి వెక్కి ఏడ్చి తండ్రి శవం పక్కనే నిద్రపోయాడు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్(MLA Bajireddy Govardan ) బాధిత కుటుంబాన్ని ఆదివారం పరామర్శించడంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది.
ఇందల్వాయి మండలం(Indalwai) వెంగల్పాడ్ గ్రామానికి చెందిన మాలవత్ రెడ్డి (34), మూడేళ్ల కుమారుడు నితిన్‌తో కలిసి జూన్ 21న ఉదయం కామారెడ్డి జిల్లా(Kamareddy) యాచారంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లారు. తండ్రీకొడుకులిద్దరు రాత్రి బైక్ పై తిరిగి వస్తుండగా సదాశివనగర్ మండలం(Sadashivanagar) దగ్గి అటవీప్రాంతంలో 44వ నంబరు జాతీయ రహదారి(44National Highway) పక్కన బారికేడ్‌ను ఢీకొట్టింది. దీంతో తండ్రీకుమారులిద్దరూ రోడ్డు పక్కన గాయాలపాలై పడిపోయారు. ప్రమాదం తరువాత రోడ్డుమీద పడటంతో తలకు బలమైన గాయం అయి తండ్రి అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషయం తెలియని బాలుడు తండ్రిని లేపేందుకు ప్రయత్నించి ఏడుస్తూ తండ్రి శవం పక్కనే నిద్రపోయాడు. ఘటన జరిగిన ఉదయం దగ్గర్లో ఉన్న ఆలయానికి పూజకోసం వచ్చిన పూజారి గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలసుకున్న స్థానిక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థికసాయం అందిస్తానని చెప్పారు.