Allu Arjun Trivikram 4th time combo fix.. AA22 movie, here are the details
OfficialAA22: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం ‘పుష్ప పార్ట్ 2′(Pushpa 2) చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ‘పుష్ప’ సినిమా తరువాత అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా ఎవరితో ఉంటుందా అని బన్ని ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. గతంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram) కాంబినేషన్ లో సినిమా ఉంటుంది అని ఇండస్ట్రి వర్గాల్లో వార్తలు వినిపించినా ఆ తరువాత వాటి గురించి ఊసే లేదు. ఇక త్రివిక్రమ్ మహేష్ బాబుతో ‘గుంటూరు కారం'(Gunturukaram)తో కుస్తీ పడుతున్నారు. అల్లు అర్జున్ ‘పుప్ప ది రూల్’ అంటూ బిజీ అయిపోయారు. తాజాగా వీరి కాంబినేషన్ ను ఖారారు చేస్తూ ‘గీతా అర్ట్స్ బ్యానర్’ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్'(Haarika Haasini Creations), ‘గీతా ఆర్ట్స్ బ్యానర్'(Gheetha Arts) సంయుక్తంగా ‘అల్లు అర్జున్ 22′(AA22) వ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం చేస్తున్నారు. విషయం తెలిసిన బన్ని ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ సినిమా వీరిద్దరి కలయికలో నాలుగువ సినిమా కావడం విశేషం. గతంలో వచ్చిన ‘జులాయి’, ‘సాన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురం’లో చిత్రాలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. తాజాగా ప్రోడక్షన్ పనులను మొదలు పెట్టిన ఈ సినిమా గత సినిమాలకు మించి ఉంటుంది అంటూ మేకర్స్ ప్రకటించడంతో అందరిలో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబుతో ‘గుంటురు కారం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి సినిమాకు చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడుతున్నాయి. వాటిని దాటుకొని ప్రస్తుతం సజావుగా షూటింగ్ జరుపుకుంటోంది. గుంటూరు కారం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. అంటే అల్లు అర్జున్ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం అవుతుందా లేదా ఈ సంవత్సరం ప్రారంభం అవుతుందా అని నెటిజనులు అభిప్రాయపడుతున్నారు.