»Bandi Sanjay Emotional Will Come To The Modi Meeting Warangal
Modi: సభకు వస్తానో లేదో బండి సంజయ్ భావోద్వేగం?
తెలంగాణ బీజేపీ(BJP) అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) ముంబయి చేరుకున్నారు. అక్కడ ముంబాదేవిని దర్శించుకుని ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే సంజయ్ మల్లీ ఢిల్లీ ఎందుకు వెళ్లారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ బీజేపీ(BJP)లో అసలు ఏం జరుగుతోంది. రోజుకో సంఘటనలతో పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్(Bandi Sanjay) ని తొలగిస్తారని ప్రచారం జరిగింది. కానీ నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్ష పదవి విషయంలో మార్పు లేదని స్పష్టం చేశారు. అంతేకాదు జూలై 8న వరంగల్లో ప్రధాని మోడీ సభకు 15 లక్షల మందిని సమాయాత్తం చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
అంతా సద్దుమణిగిందని అనుకుంటున్న క్రమంలో బండి సంజయ్ తన సన్నిహితుల వద్ద అధ్యక్ష పదవి గురించి ముచ్చటించినట్లు తెలుస్తోంది. తాను వరంగల్(warangal) మోడీ(modi) సభకు వస్తానో రానోనని భావోద్వేగంతో పేర్కొన్నట్లు సమాచారం. అధ్యక్ష పదవి బాధ్యతలు రెండు మూడు రోజులే ఉంటాయని అన్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే బండి సంజయ్ ముంబయి చేరుకున్నట్లు తెలిసింది. అక్కడ ముంబాదేవిని దర్శించుకుని అక్కడి నుంచి ఢిల్లీకి సంజయ్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.