»Abolition Of Child Marriage In Karnataka The Groom Beheaded The Girl
Viral News: బాల్య వివాహం రద్దు.. బాలిక తల నరికి ఉరేసుకున్న వరుడు
బాల్యం వివాహం జరుగుతుందని తెలుసుకున్న అధికారులు వధువు ఇంటికి వచ్చి తల్లిదండ్రులను పెళ్లి రద్దుకు ఒప్పించారు. విషయం తెలుసుకున్న వరుడు కోపం అమ్మాయి తల నరికి పారిపోయాడు. అతని కోసం వెతికితే ఓ చెట్టుకు ఉరేసుకొని కన్పించాడు.
Viral News: ఈ రోజుల్లో బాల్యవివాహాలు ఎక్కడా అని చాలా మంది అంటుంటారు కానీ, ఇంకా మారు మూల గ్రామాలలో అవి జరుగుతూనే ఉన్నాయి. పేదరికం, నిరరక్షరాస్యత కారణంగానే ఇలాంటి దురాచారాలు కొనసాగుతున్నాయి. తాజాగా వెలుగుచూసిన ఓ ఘటన స్థానికంగానే కాదు దేశ వ్యవస్థనే ప్రశ్నించేలా ఉంది. ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్న ఓ అమ్మాయి మైనర్ అని తెలియడంతో అధికారులు వారి వేడుకను అడ్డుకున్నారు. దానికి కోపంగించిన వరుడు బాలిక తల నరికాడు. తాజాగా బయటకు వచ్చిన ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొడుగు జిల్లాలోని సూర్లబ్బి గ్రామంలో మీనా (16), అదే ప్రాంతానికి చెందిన ప్రకాశ్ (32) వీరిద్దరికి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నారు. ఎంగెజ్మెంట్ ఫిక్స్ చేసుకున్నారు. గురువారం నిశ్చితార్థం జరుగుతున్న సమయంలో సమాచారం అందుకున్న మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు వేడుక జరిగే ప్రదేశానికి వచ్చారు.
అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడారు. బాల్యవివాహం నేరమని వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో బాలిక పేరెంట్స్ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. అయితే ఈ సమాచారం మీనానే ఇచ్చిందన్న అనుమానంతో ప్రకాశం అమ్మాయి ఇంటికి వెళ్లాడు. తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. తరువాత మీనపై దాడి చేశాడు. తనను ఇంటినుంచి బయటకు లాక్కెళ్లి తల నరికాడు. తరువాత అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రకాశ్ కోసం గాలించారు. ఘటన స్థలానికి ఓ మూడు కిలోమీటర్ల దూరంలో ఓ చెట్టుకు ఉరివేసుకొని ప్రకాశ్ మరణించినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.