CBI Court: Court permission for Jagan's foreign visit
CBI Court: ఏపీ సీఎం జగన్కు ఊరట లభించింది. విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 16 నుంచి జూన్ 1 వరకు యూరప్ పర్యటనకు కుటుంబంతో కలిసి వెళ్లడానికి అనుమతి కోరారు. లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాంలడ్లో పర్యటించేందుకు వీలుగా అనుమతి ఇవ్వాలని జగన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వద్దని సీబీఐ కోరింది. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు జగన్ విదేశీ పర్యటనను అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పర్యటనకు వెళ్లే ముందు వ్యక్తిగత ఫోన్ నంబర్, జీ మెయిల్ వివరాలు ఇచ్చి వెళ్లమని జగన్ను కోర్టు ఆదేశించింది. అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు బెయిల్ షరతులు సడలించి అనుమతి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.