Nara Lokesh : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్(Nara Lokesh) మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. విద్యా శాఖ, ఐటీ శాఖల మంత్రిగా ఆయన నేడు బాధ్యతలు తీసుకున్నారు. తొలిసారి సోమవారం తన ఛాంబర్లో ప్రవేశించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్చారణలతో ఆయనకు స్వాగతం పలికి ఆశీర్వదించారు. అనంతరం ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేశారు. మెగా డీఎస్సీ ఫైల్ పైనే తొలి సంతకం చేశారు. మొత్తం 16,347 పోస్టుల భర్తీ కోసం క్యాబినేట్ ముందు ఉంచాల్సి దస్త్రంపై ఆయన తొలి సంతకం చేశారు.
తొలి ఫైల్‌పై సంతకం చేసిన అనంతరం అక్కడున్న అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, తెదేపా అధికారులు తదితరులంతా లోకేష్‌కు(Lokesh) అభినందనలు తెలియజేశారు. మంత్రులు గుమ్మిడి సంధ్యారాణి, వంగలపూడి అనిత, సవిత తదితరులు ఆయనను అభినందించారు. అలాగే ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, కంచర్ల శ్రీకాంత్ తదితరులంతా అక్కడకు వచ్చి ఆయనకు అభినందనలు తెలిపారు. పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.