»Actor Nagarjuna Apologises After Bodyguard Mistreating Fan At Airport
Nagarjuna : అభిమానికి సారీ చెప్పిన నాగార్జున.. ఎందుకంటే..?
కింగ్ నాగార్జున తన అభిమానికి క్షమాపణలు చెప్పారు. తన బాడీగార్డు చేసిన పనికి ఇబ్బంది పడిన అభిమానికి నాగార్జున ఎక్స్ వేదికగా సారీ చెబుతున్నట్లు వెల్లడించారు.
Actor Nagarjuna Apologises to Fan : సీనియర్ హీరో నాగార్జున తన అభిమాని విషయంలో జరిగిన పొరపాటుకు కలత చెందారు. ఆ అభిమానికి సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. మరో సారి ఇలా జరగకుండా చూసుకుంటానంటూ తెలిపారు. అందుకు అవసరమైన ముందస్తు ప్రికాషన్స్ తీసుకుంటానంటూ వెల్లడించారు. ఇంతకీ అభిమాని విషయంలో జరిగినది ఏమిటి? రండి తెలుసుకుందాం.
నాగార్జున(Nagarjuna) ప్రస్తుతం కుబేర మూవీ షూటింగ్లో ఉన్నారు. హైదరాబాద్లో జరిగే షెడ్యుల్ కోసం ఆయన ఎయిర్పోర్ట్లో(Airport) ఉన్నారు. ఆయన వెంట ధనుష్ కూడా ఉన్నారు. నాగార్జునకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకునేందుకు ఆయన పక్కన బాడీ గార్డులు కూడా ఉన్నారు. నాగార్జునను చూసిన ఓ ముసలి అభిమాని(Fan) పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకు వచ్చారు. పక్కనే ఉన్న బాడీ గార్డు(Bodyguard) అభిమానిని నిలవరించే క్రమంలో పక్కకు తోసినట్లుగా చేశారు.
దాంతో ఆ అభిమానికి కిందపడినంత పనైంది. కింద పడిపోలేదు కాని కాస్త ముందుకు వాలిపోయి తమాయించుకుని మళ్లీ నిలబడ్డారు. ఈ వీడియో నెట్టింట ప్రస్తుతం వైరల్గా మారింది. నాగార్జున(Nagarjuna) దృష్టిలో కూడా పడింది. దీంతో ఈ విషయంలో తాను అపాలజీ చెబుతున్నట్లు ఆయన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. మరోసారి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేలా చూసుకుంటానని మాట ఇచ్చారు. వైరల్ అయిన ఆ వీడియోపై ఇక్కడ మీరూ ఓ లుక్కేయండి.