»Gunmen Attack Churches Synagogues In Russia Cops Priest Among 15 Killed
Russia : రష్యాలో ప్రార్థనాలయాలపై ఉగ్రదాడి.. 15 మంది మృతి
రష్యాలో మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో పోలీసులు, చర్చి ఫాదర్ సహా మొత్తం 15 మంది మరణించారు. పోలీసులు వారిని తిప్పికొట్టేందుకు జరిపిన కాల్పుల్లో మరో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి. చదివేయండి.
Russia : రష్యాలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. చర్చిలు, యూదుల ప్రార్థనాలయాలను లక్ష్యంగా చేసుకుని విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. వారిని నిలువరించే క్రమంలో పోలీసులు కూడా వారిపై ఎదురు కాల్పులు చేశారు. ఈ దాడి(Attack)లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే పోలీసు అధికారులు, యూదుల ప్రార్థనాలయ ప్రీస్ట్(Priest), సామన్య ప్రజలు సహా మరో 15 మంది ఈ ఘటనలో మృత్యువాత పడ్డారు. ఈ ఘటన రష్యా(Russia) డాగేస్థాన్లో జరిగింది.
భద్రతాదళాలు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మరో 15 మంది గాయాలపాలయ్యారు. ఈ విషయాన్ని డాగేస్థాన్ గవర్నర్ సెర్గీ మెలికోవ్ వెల్లడించారు. అక్కడి మఖచ్కల, బెర్బెంట్ నగరాల్లోని ప్రార్థనా మందిరాల్ని, చర్చిల్ని(Churches) లక్ష్యంగా చేసుకుని వారు ఈ కాల్పులకు తెగబడ్డారని పేర్కొన్నారు. దీంతో ఉగ్రవాదులను ఏరివేసేందుకు పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆపరేషన్ ముగిసినట్లు ఉగ్రవాద నిరోధక కమిటీ ప్రకటించింది.
ఈ ఉగ్రవాదుల కాల్పుల అనంతరం యూదుల ప్రార్థనా మందిరంలో మంటలు ఎగసిపడ్డాయి. ఈ ఘటనకు సంబంధించి 24, 25, 26 తేదీల్లో సంతాప దినాలుగా జరుపుకోవాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించంది. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్లో వైరల్గా మారాయి.