నాగార్జున… చెబితేనే వెర్సటైలిటీ గుర్తొస్తుంది.. ఆయన చేయని ప్రయోగం లేదు, ఆయన్ను అభిమానులు సెల్యు లాయిడ్ సైంటిస్ట్ అని పిలుచుకునేవారు. తమిళ సూపర్ స్టార్ రాజనీకాంత్ సరికొత్త చిత్రం ‘కూలీ’లో కీలక పాత్రలో కింగ్ నాగార్జున నటిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున పాత్రకు సంబంధించిన క్యారెక్టర్ పోస్టర్ ను ఆయన పుట్టినరోజు 29 ఆగస్టు న రోజున విడుదల చేసారు.
‘కూలీ’ చిత్రంలో నాగార్జున పాత్ర పేరు ‘సైమన్’. ఆయన పాత్ర యొక్క ప్రత్యేకత మరియు లుక్ గురించి ప్రదర్శించిన పోస్టర్ అభిమానులను మెప్పించింది. సైమన్ పాత్ర ఈ సినిమాపై మరింత ఉత్కంఠను పెంచింది.
ఇక, నాగార్జున మరో ప్రాజెక్టు ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తారు. ఈ చిత్రంలో ధనుష్ మరియు రష్మిక మందన్న లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ‘కుబేర’ కోసం ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి, ఎందుకంటే శేఖర్ కమ్ముల గత చిత్రాలు కూడా సక్సెస్ అయ్యాయి.
అటు ‘కూలీ’ మరియు ‘కుబేర’ వంటి ప్రాజెక్టులతో నాగార్జున తన సినీ కెరియర్ లో ఎప్పుడు లేని విధంగా ఒకేసారి రెండు మల్టీ స్టారర్ సినిమాలు చేస్తున్నారు. అభిమానులు ఈ రెండు చిత్రాల విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.