Nagarjuna: సూపర్ కాంబో.. మరోసారి నాగార్జునతో పూరి?
కింగ్ నాగార్జున, పూరి జగన్నాథ్ కలిసి మరోసారి పని చేయబోతున్నారా? అంటే, అవుననే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్‌తో బిజీగా ఉన్న పూరి, నెక్స్ట్ ప్రాజెక్ట్ కింగ్‌తోనే అని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత?
Nagarjuna: డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి అందరికీ తెలిసిందే. చంటిగాడు, పండుగాడు, సూర్య భాయ్, శివమణి.. అంటూ ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన పూరి.. ప్రస్తుతం బ్యాడ్ ఫేజ్‌లో ఉన్నాడు. లైగర్ వంటి ఫ్లాప్ తర్వాత రామ్‌తో డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నాడు. రీసెంట్‌గానే ఈ సినిమా టీజర్ రిలీజ్ అవగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఖచ్చితంగా పూరి ఈ సినిమాతో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అవడం గ్యారెంటీ అనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. ఇదిలా ఉంటే.. పూరి నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. లేటెస్ట్ అప్టేట్ ఒకటి మాత్రం వైరల్‌గా మారింది. కింగ్ నాగార్జునతో మరోసారి కలిసి సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట పూరి. గతంలో పూరి, నాగ్ కాంబోలో సూపర్, శివమణి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి.
సూపర్ సోసోగా నిలిచినా.. నా పేరు శివమణి, నాక్కొంచెం మెంటల్.. అంటూ దుమ్ముదులిపేశాడు నాగార్జున. ఇప్పుడు దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ఈ కాంబో రిపీట్ కాబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం నాగార్జున.. ధనుష్ ‘కుబేర’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇది తప్పితే.. ఇంకా కొత్త ప్రాజెక్ట్ ఏది కూడా అనౌన్స్ చేయలేదు. కానీ.. ఈ మధ్యనే పూరి, నాగార్జునని కలిసి ఓ స్టోరీ లైన్ వినిపించాడని సమాచారం. ఆ లైన్ బాగా నచ్చడంతో నాగ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. డబుల్ ఇస్మార్ట్ తర్వాత ఈ ప్రాజెక్ట్ ఉంటుందని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియదు గానీ, మరోసారి ఈ సూపర్ కాంబో మాత్రం ఇంట్రెస్టింగ్గా మారింది.