Gam Gam Ganesha: విజయ్ దేవరకొండ.. ఇది అయ్యే పనేనా?
ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే.. అప్పుడెప్పుడో అనౌన్స్ చేసిన సినిమా ఒకటి దాదాపుగా ఆగిపోయిందని అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ ఈ ప్రాజెక్ట్ ఉంటుందనే న్యూస్ వైరల్‌గా మారింది.
Gam Gam Ganesha: వాస్తవానికైతే.. ఈ క్రేజీ కాంబో ఎప్పుడో రావాల్సింది. ఎందుకంటే.. అప్పుడెప్పుడో సుకుమార్, విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటికీ కూడా ఈ కాంబో వర్కౌట్ కాలేదు. అసలు ఉంటుందా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే.. పుష్ప2 తర్వాత రామ్ చరణ్‌తో సినిమా అనౌన్స్ చేశాడు సుకుమార్. దీంతో.. విజయ్ సినిమా ఆగిపోయినట్లేనని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు విజయ్-సుకుమార్ కాంబినేషన్‌కి సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్‌గా మారింది. ఈ ప్రాజెక్ట్ ఆగిపోలేదట. రామ్ చరణ్ ఆర్సీ 17 తర్వాత.. విజయ్‌తో సుకుమార్ సినిమా చేస్తాడని అంటున్నారు. లేటెస్ట్గా.. ఆనంద్ దేవరకొండ నటించిన గంగం గణేశా ప్రీ రిలీజ్ ఈవెంట్లో.. నిర్మాత కేదార్ సెలగంశెట్టి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం వరుస సినిమాలతో సుకుమార్ బిజీగా ఉన్నారని, రామ్ చరణ్‌తో సినిమా కంప్లీట్ చేసిన తర్వాత విజయ్‌తో సినిమా చేస్తారని చెప్పారు. ఈ ప్రాజెక్టు కచ్చితంగా ఉంటుందని వెల్లడించారు.
దీంతో.. రౌడీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే.. పుష్ప2 కోసం చాలా సమయం తీసుకున్న సుకుమార్.. రామ్ చరణ్ సినిమా ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో ఇప్పుడే చెప్పలేం. ఎంత లేదన్నా ఈ సినిమా కోసం రెండు మూడేళ్లు తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. అప్పటి వరకు పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం. కాబట్టి, విజయ్ దేవరకొండ, సుకుమార్ కాంబో వర్కౌట్ అయ్యే పనేనా అనే చర్చ జరుగుతోంది. కానీ మేకర్స్ ఇంత కాన్ఫిడెన్స్‌గా చెబుతున్నారంటే, ఈ ప్రాజెక్ట్ లేట్ అయినా కూడా ఖచ్చితంగా ఉండే ఛాన్స్ అయితే ఉంది.