»Minister Sri Bala Veeranjaneya Swamy Ap Minister Who Gave Clarity On The Volunteer System
Minister Sri Bala Veeranjaneya swamy: వాలంటీర్ల వ్యవస్థపై క్లారిటీ ఇచ్చిన ఏపీ మంత్రి
ఏపీ వాలంటీర్ల వ్యవస్థను సీఎం చంద్రబాబు కొనసాగిస్తారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకుంటే ఈ నెల పింఛన్ల పంపిణీని సచివాలయ ఉద్యోగులతో ఇస్తున్నారు. దీంతో వాలంటీర్ల వ్యవస్థ ఇక ఉండదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ఏపీ మంత్రి స్పందించారు.
Minister Sri Bala Veeranjaneya swamy: AP minister who gave clarity on the volunteer system
Minister Sri Bala Veeranjaneya swamy: ఏపీ వాలంటీర్ల వ్యవస్థను సీఎం చంద్రబాబు కొనసాగిస్తారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకుంటే ఈ నెల పింఛన్ల పంపిణీని సచివాలయ ఉద్యోగులతో ఇస్తున్నారు. దీంతో వాలంటీర్ల వ్యవస్థ ఇక ఉండదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ జగన్ ప్రారంభించిన వాలంటీర్ల వ్యవస్థపై టీడీపీ గతంలో వ్యతిరేకించింది. కానీ ఎన్నికల సమయంలో వాలంటీర్ల వ్యవస్థను ఉంచుతామని చెప్పి, జీతం కూడా పెంచుతున్నట్లు ప్రకటించారు.
అయితే దీనిపై ఏపీ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి ఒక క్లారిటీ ఇచ్చారు. వాలంటీర్ల వ్యవస్థ రద్దుపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని తెలిపారు. ఏపీ రాష్ట్ర సాంఘీక సంక్షేమ, దివ్యాంగుల, సీనియర్ సిటిజన్స్, సచివాలయం గ్రామ వాలంటీర్ల శాఖ మంత్రిగా డోలా ఈరోజు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీని అభివృద్ధి పథంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు అన్ని తమ ప్రభుత్వంపై పడిందన్నారు.