»Andhra Pradesh Free Bus Facility For Women Since When
Andhra Pradesh: మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఎప్పటినుంచంటే?
ఏపీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ రవాణా, క్రీడల శాఖ మంత్రిగా ఆయన ఈరోజు బాధ్యతలు చేపట్టిన ఏపీ మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి.. నెలలోగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.
Andhra Pradesh: Free bus facility for women since when?
Andhra Pradesh: ఏపీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే నెలలోగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఏపీ మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఏపీ రవాణా, క్రీడల శాఖ మంత్రిగా ఆయన ఈరోజు బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత రామ్‌ప్రసాద్ రెడ్డి ఆర్టీసీ సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇచ్చే ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటుపై మొదటి సంతకం చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.
కర్ణాటక, తెలంగాణలో ఉచిత బస్సు సౌకర్యంపై సమీక్ష నిర్వహించి తెలుసుకుంటామని తెలిపారు. ఉచిత బస్సు పెట్టడం వల్ల ఎదురయ్యే సమస్యలపై కూడా చర్చిస్తామని తెలిపారు. అలాగే రాష్ట్రంలో క్రీడా వసతులు మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. ప్రతిభ కనబరిచే క్రీడాకారులను ప్రోత్సహిస్తామన్నారు. ఆర్టీసీలో ప్రమాదాల నివారణపై కూడా ప్రత్యేక దష్టి పెట్టినట్లు తెలిపారు. తనకు మూడు శాఖలు కేటాయించినందుకు సీఎం చంద్రబాబుకు రామ్‌ప్రసాద్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.