సామాజిక మాధ్యమం ఎక్స్ కొత్త కొత్త రూల్స్‌ను తీసుకొస్తుంది. తన ప్రీమియం సబ్స్క్రైబర్లను పెంచుకోవాలని.. ఎక్స్‌లో కేవలం ప్రీమియం సబ్స్క్రైబర్లు మాత్రమే లైవ్ స్ట్రీమ్ చేసే సదుపాయం ఉండనుందని సమాచారం.
X: A subscription is required to start livestreaming on X!
X: సామాజిక మాధ్యమం ఎక్స్ కొత్త కొత్త రూల్స్‌ను తీసుకొస్తుంది. తాజాగా తన ప్రీమియం సబ్స్క్రైబర్లను పెంచుకోవాలని కొత్త మార్పును తీసుకురానున్నట్లు సమాచారం. ఇకపై లైవ్‌స్ట్రీమ్‌ను ప్రారంభించాలంటే కచ్చితంగా ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉండాలని ఎక్స్ వేదికగా లైవ్ ప్రొఫైల్ తెలిపింది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, టిక్‌టాక్ వంటి సోషల్‌మీడియా వేదికల్లోనూ లైవ్ స్ట్రీమింగ్ సదుపాయం ఉంది. అయితే వీటిలో లైవ్ స్ట్రీమింగ్‌ను ప్రారంభించాలంటే ఎటువంటి ప్రీమియం సభ్యత్వం అవసరం లేదు.
వచ్చే రోజుల్లో ఎక్స్‌లో కేవలం ప్రీమియం సబ్స్క్రైబర్లు మాత్రమే లైవ్ స్ట్రీమ్ చేసే సదుపాయం ఉండనుందని తెలిపింది. ఎక్స్ బేసిక్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ధర నెలకు రూ.215 నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఈ నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనే విషయం తెలియదు. వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం కూడా పడిపోతుండటంతో సబ్స్క్రైబర్ల ద్వారా వచ్చిన ఆదాయంతో నష్టాన్ని సరిదిద్దాలని మస్క్ ప్రయత్నిస్తున్నారు.