Tamannah: ఇండస్ట్రీకి వచ్చి నిలదొక్కుకోవాలంటే అంద చందం, అభినయం, టైమ్ మేనెజ్ మెంట్ తప్పనిసరి. హీరోలకు అంత లేకున్నా.. హీరోయిన్లకు మాత్రం కంపల్సరీ. ఒకసారి లైమ్ లైట్లోకి వస్తే ఇక ఆపే వారు ఉండరు. అప్పట్లో అయితే హీరోయిన్‌కు మంచి పేరు వస్తే చాలు.. కనీసం పదేళ్లు తిరుగు ఉండేది కాదు.. ఇప్పుడు అయితే అంతలా లేదు. మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannah) కూడా కెరీర్ తొలినాళ్లలో ఇబ్బందులను ఎదుర్కొందట. తనను దారుణంగా కామెంట్స్ చేశారని.. బాడీ షేమింగ్ (Body Shaming) గురించి మాట్లాడారని బాధపడింది.
ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో తనను చూసి కొందరు తప్పుగా మాట్లాడారని తమన్నా (Tamannah) తెలిపింది. తనకు హెడ్ లైట్స్ లేవని ఎద భాగాలపై విమర్శలు చేశారని గుర్తుచేసింది. దాంతో తాను ధైర్యం కోల్పోయానని.. తనకు కుటుంబ సభ్యులు అండగా నిలిచారని పేర్కొంది. వారు సపోర్ట్ చేయడంతో తిరిగి సినిమాలు తీయగలిగానని.. తర్వాత ఈ స్థాయికి చేరగలిగానని వివరించింది. లేదంటే తన కెరీర్ అప్పుడే ముగిసేదని చెప్పింది.
తెలుగు ఇండస్ట్రీ టాప్-5 హీరోయిన్లలో తమన్నా (Tamannah) ఒకరిగా ఉంటారు. ఇటీవల విడుదలైన భోళా శంకర్, జైలర్ సినిమాల్లో నటించి మెప్పించారు. భోళా శంకర్ మూవీ దెబ్బకొట్టగా.. జైలర్ మూవీ మంచి హిట్ అయ్యింది. వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది. ఇటీవల వచ్చిన ఓ సిరీస్‌లో హాట్‌గా నటించింది. కొద్దిరోజులు గ్లామర్ షోకు దూరంగా ఉన్న తమన్నా.. తర్వాత అన్నీ రోల్స్‌కు ఓకే అంటోంది. ఫ్యాన్స్‌తో కూడా తమన్నా (Tamannah) సరదాగా ఉంటారు. ఇటీవల తమిళనాడులో ఓ అభిమాని సెల్ఫీ అడగగా.. పిక్ దిగి, ఆ సిచుయేషన్‌ను కూల్‌గా హ్యాండిల్ చేసింది.
నటుడు విజయ్ వర్మ- తమన్నా (Tamannah) ప్రేమలో ఉన్నారు. విజయ్‌తోనే తమన్నా బోల్డ్ సీన్స్‌లో నటించింది. వారిద్దరూ కలిసి వెబ్ సిరీస్‌లో నటించి, ఆకట్టుకున్నారు. ఇద్దరూ కలిసి చెట్టపట్టాల్ వేసుకొని తిరగడంతో వారి ప్రేమ విషయం తెలిసింది. ప్రేమ గురించి అడుగుతూ.. పెళ్లి ఎప్పుడూ అంటే.. మేమిద్దరం మంచి స్నేహితులం అని సమాధానాన్ని దాటవేస్తున్నారు.