SRCL: విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగడానికి ఉపాధ్యాయులు ప్రోత్సాహాన్ని అందివ్వాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. ఇల్లంతకుంట మండలకేంద్రంలోని జిల్లాపరిషత్ పాఠశాల, గాలిపెల్లి గ్రామంలోని బీసీ బాలుర వసతి గృహాలను మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భావి భారత నిర్మాణంలో విద్యార్థులే కీలకమని పేర్కొన్నారు.