KMR: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులు అధైర్య పడవద్దుని ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. ఆయన మంగళవారం సాయంత్రం నాగిరెడ్డిపేట మండలంలోని పల్లె బొగుడ తండా, బెఙ్గం చెరువు తండా, జప్తి జానకంపల్లి, నాగిరెడ్డిపేట తదితర గ్రామాల్లో పర్యటించారు. వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు.