»Vishwak Sen Is Ready For Marriage Who Is The Girl
Vishwak Sen: పెళ్లికి రెడీ అయిన విశ్వక్ సేన్..అమ్మాయి ఎవరు?
విశ్వక్ సేన్(Vishwak Sen) అంటేనే.. వివాదాలు ఎక్కువగా గుర్తొస్తాయి. సినిమా కోసం ఈ యంగ్ హీరో ఎంతవరకైనా వెళ్తాడని.. ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తునే ఉన్నాడు. అందుకే తనతోటి హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం విశ్వక్ కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఇలాంటి సమయంలో పెళ్లి పీఠలెక్కబోతున్నానని షాక్ ఇచ్చాడు మాస్ కా దాస్.
అశోకవనంలో అర్జున కళ్యాణ్ సినిమా రిలీజ్ సమయంలో విశ్వక్(Vishwak Sen) చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఓ ప్రముఖ టీవి స్టూడియోలో లైవ్‌లోనే రచ్చ చేశాడు. ఇక యాక్షన్ కింగ్ అర్జున్ ప్రాజెక్ట్ నుంచి బయటికొచ్చి.. అందరికీ షాక్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత తన పని తాను చేసుకుంటు పోతున్నాడు దాస్. చివరగా ధమ్కీ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఇక రీసెంట్గా బేబి సినిమా విషయంలో కూడా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. ఇక ఇప్పుడు ఉన్నట్టుండి పెళ్లి పీఠలెక్కబోతున్నట్టు చెప్పి షాక్ ఇచ్చాడు.
తాజాగా విశ్వక్ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు విశ్వక్ సేన్. ‘నా ఫ్యాన్స్‌కు, శ్రేయోభిలాషులకు.. ఇన్నేళ్ళుగా మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు, అభిమానానికి నేనెప్పటికీ ఋణపడి ఉంటాను. ఇప్పుడు నేను మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను. నేను నా జీవితంలో కొత్త అధ్యయనాన్ని మొదలుపెట్టాలి అనుకుంటున్నాను. నేను ఫ్యామిలీని స్టార్ట్ చేస్తున్నాను.. త్వరలోనే మిగతా వివరాలు చెప్తాను.. థాంక్యూ.. మీ విశ్వక్ సేన్’ అంటూ రాసుకొచ్చాడు. అయితే.. ఆ డీటెయిల్స్ ఆగస్టు 15న చెప్తాను అని తెలిపాడు. దీంతో నిజంగానే విశ్వక్ సేన్ పెళ్లి చేసుకుంటున్నాడా? అయితే అమ్మాయి ఎవరు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్(hot topic)గా మారింది. లేదంటే.. ఇది సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చేస్తున్న స్టంట్‌నా? అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. దీంతో ఈ పోస్ట్ పై అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది కంగ్రాట్స్ చెబుతుండగా.. ఇంకొంతమంది మళ్లీ ప్రాంక్ చేయకు బ్రో అంటున్నారు. మరి అనుమానాలకు క్లారిటీ రావాలంటే.. రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.