»Fan Open Letter To Megastar Chiranjeevi About Remake Movies
Megastar chiranjeevi:కి ఓపెన్ లెటర్స్ హెచ్చరిక..ఇక వద్దు బాసూ
ఎవరో ఎందుకు.. తన తోటి హీరో తనకు పోటీ హీరో బాలకృష్ణనే తీసుకుంటే.. వరుసగా స్ట్రెయిట్ సినిమాలు చేస్తున్నాడు. కానీ మెగాస్టార్(megastar chiranjeevi) మాత్రం రిస్క్ ఎందుకులే అని రీమేక్ సినిమాలు చేస్తున్నారు. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ ఎప్పటి కప్పుడు నిరాశకు గురి అవుతునే ఉన్నారు. తాజాగా భోళా శంకర్(bhola shankar) రిజల్ట్ చూసిన తర్వాత మెగాభిమానులు ఓపెన్ లెటర్స్ రాస్తున్నారు.
మిగతా హీరోలంతా పాన్ ఇండియా లెవల్లో భారీ సినిమాలు చేస్తు దూసుకుపోతున్నారు. తమ మార్కెట్‌ను వేల కోట్ల వైపుగా తీసుకెళ్తున్నారు. కానీ టాలీవుడ్కె బాస్ అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి(megastar chiranjeevi) మాత్రం.. ఔట్ డేటెడ్ కథతో, రీమేక్‌లో మెగాభిమానులకు ఎక్కడా లేని మనో వేదనకు గురి చేస్తున్నాడు. అసలు ఇప్పటి వరకు మెగాస్టార్ చూడని సక్సెస్ లేదు, ఫ్లాప్ లేదు. జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన చిరు.. ఇప్పుడు చేయాల్సింది ఏంటి? రీమేక్ కథలా? కానే కాదు.. అభిమానులకు జీవితాతం గుర్తిండిపోయే సినిమాలు చేయాలి. ఇది భోళా శంకర్(bhola shankar) సినిమా చూసిన ప్రతి ఒక్క మెగాభిమాని మదిలో కలిగిని ఫీలింగ్. పోయిన సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్‌ని రఫ్ఫాడించాడు మెగాస్టార్ చిరంజీవి. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల ఫ్లాప్ తర్వాత కూడా తన ఇమేజ్ అండ్ మార్కెట్ ఏ మాత్ర డ్యామేజ్ కాలేదని మరోసారి ప్రూవ్ చేశాడు. కానీ మళ్లీ భోళా శంకర్‌తో అతిపెద్ద డిజాస్టర్ ఇచ్చాడు. ఈ సినిమా ఏకంగా రెండో రోజు 75% డ్రాప్ అయిదంటే..రిజల్ట్‌ను ఓసారి ఊహించుకోవచ్చు. అందుకే.. మెగాస్టార్‌కు ఓపెన్ లెటర్స్ రాస్తున్నారు మెగాభిమానులు. ఓ అభిమాని తన వేదనను వర్ణించలేని మాటలతో చెప్పుకొచ్చాడు.
తోటి ఆర్టిస్టులకు కూడా…
కొణిదెల శివశంకర వరప్రసాద్ అలియాస్ మెగాస్టార్ చిరంజీవి అంటేనే ఓ సెన్సేషన్. స్వయంకృషి అనేది సినిమాలోనే కాదు.. నిజ జీవితంలోను స్వయంకృషితో ఎదిగిన చిరంజీవి.. ఇప్పుడు స్వయంకృపరాధంతో తన స్టామినాని తనే తగ్గించుకుంటున్నారా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ క్యశ్చన్గా మారింది. ఖైదీ సినిమాతో చిరంజీవి స్టార్ అయ్యారు అనుకుంటారు చాలామంది. కానీ అప్పటి సూపర్ స్టార్స్ కృష్ణ గారు, శోభన్ బాబు గారు కలిసి నటించిన సినిమా ముందడుగు కంటే కూడా ఎక్కువ థియేటర్స్‌లో ఖైదీ సినిమా రిలీజ్ అయ్యింది అంటే, చిరంజీవి ఎప్పుడు స్టార్ అయ్యాడో కూడా ట్రేడ్కే కాదు, ఎవరికి తెలియదు. క్యారవ్యాన్ వున్నా కూడా అందులోకి వెళ్లి రెస్ట్ తీసుకోకుండా స్పాట్ లోనే ఉంటూ.. అవసరమైతే తన తోటి ఆర్టిస్టులకు కూడా ఇన్స్పైర్ చేస్తుంటాడు. మాస్టర్ సినిమా టైంలో విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పిన కథ గుర్తు పెట్టుకొని 11 ఏళ్ల తర్వాత పిలిచి దర్శక ధీరుడుతో మగధీర సినిమా చేయింది.. రామ్ చరణ్(ramcharan)కి తిరుగులేని స్టార్ డం వచ్చేలా చేసారు. ఇలాంటివి మీలో వున్న గొప్ప క్వాలిటీస్లో కొన్ని మచ్చుతునకలు మాత్రమే. అలాంటి మీరు ఎందుకు ఇలా గాడ్ ఫాదర్, భోళా శంకర్ లాంటి సినిమాలు చేస్తున్నారో అర్థం కావడం లేదు.. హిట్ ఫ్లాప్ అనేది ఎవరి చేతుల్లో వుండదు.. కానీ స్ట్రెయిట్ సినిమా చేస్తే వచ్చే కిక్ ఇలా రీమేక్స్‌లో రావు.
ఎదుకు రీమేక్స్..?
ఒక అభిమానిగా మా బాధ మీకు చెప్పుకోవాలనేదే ఈ చిన్న ప్రయత్నం.. అసలు ఈ డిజిటల్ కాలంలో ఎదుకు రీమేక్స్ చేస్తున్నారు? ఫ్యాన్స్(fans) కోసం సినిమాలు తీసే మీరు ఫ్యాన్స్ తలదించుకునే సినిమాలు చెయ్యడం చాలా బాధ వేస్తుంది. అసలు ఆచార్య, గాడ్ ఫాదర్ రేంజ్లో అయినా ఫైనల్ రన్లో భోళా శంకర్‌కు అన్ని వసూళ్లు రావేమో అనిపిస్తుంది. ఒక్క రోజులోనే రూ.100 కోట్ల గ్రాస్ తీసుకొచ్చే స్టామినా మీకుంది. ఒక ప్రాంతీయ భాషలోనే రూ.300 కోట్ల వున్న మార్కెట్‌ని మీరే రూ.30 కోట్లకి తెచ్చుకుంటున్నారు అనిపిస్తుంది. మీరు తల్చుకుంటే ఎంత సేపు చెప్పండి సార్. బాక్సాఫీస్ స్ బద్దలయ్యే స్టోరీస్ రాసే రైటర్స్ వున్నారు, మన దగ్గర, ఎంతో గొప్ప సాహిత్యం వుంది.. వెతుక్కోవాలే కానీ ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్, ఇంద్ర లాంటి సాలిడ్ బ్లాక్ బస్టర్స్ ని మళ్ళీ ఈ జనరేషన్ కి చూపించోచ్చు. మేమే కాదు. మీరు కూడా అనవసరంగా ఈ సినిమా చేసాను అని బాధపడుతూ వుంటారు. అయినా సరే, వన్ ఇయర్ లోపే రికార్డ్స్ బద్దలయ్యే సినిమా ఇస్తారు. ఫ్యాన్స్ కాలర్ ఎగేరేసేలా చేస్తారు. అప్పుడు ఇలా మిమ్మల్ని విమర్శించిన ప్రతి నోరు మెచ్చుకునేలా చేస్తారనే విషయం మీ అభిమానిగా నాకు తెలుసు సార్. కానీ దయచేసి రీమేక్స్(remakes) మాత్రం చేయకండి.. మీరు స్ట్రెయిట్ సినిమాలు చేయండి రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ మేము ఇస్తాము.. మీరు ఎప్పటికీ మా గుండెల్లో మెగాస్టారే.. తెలుగు హీరోల్లో ఎవరెస్ట్ శిఖరమే.. అని ఓ అభిమాని ఓపెన్ లెటర్ రాసుకొచ్చాడు.
ఇక మరో మెభిమాని ఆవేదన చూస్తే..
ప్రియమైన భోళా అన్నయ్యకి.. మీ శతకోటి అభిమానుల్లో ఒకడిగా ఇలా ఒక ఓపెన్ లెటర్(open letter) రాయాల్సి వస్తుందని ఊహించలేదు. ఇవాళ గంపెడాశలతో భోళా శంకర్ వెళ్ళా. నా జీవితంలో మొదటిసారి మీ సినిమా హౌస్ ఫుల్ అయినా ఈలలు కేకలు వినిపించకుండా చూసింది ఇదొక్కటే. క్లైమాక్స్‌లో మీరు చివరి విలన్ని చంపడానికి ముందే నేను లేచి థియేటర్ బయటికి వచ్చేస్తే.. పక్కనే నాతో పాటు వచ్చిన ఫ్రెండ్ ప్రదర్శించిన ఆశ్చర్యం ఇంకా నా కళ్ళముందు పచ్చిగానే ఉంది. అసలేం జరుగుతోంది అన్నయ్య. ఎవరికో ఎప్పుడో ఇచ్చిన మాటల కోసం అవకాశాలిస్తారా. కథల జడ్జ్ మెంట్లో ఎంతో నిక్కచ్చిగా ఉండే మీ లెక్క ఎక్కడ తప్పుతోంది. కాలం చెల్లిన నక్సలైట్ల కాన్సెప్ట్‌ని పాదఘట్టంకి ముడిపెట్టి ఆచార్యతో మమ్మల్ని బాధ పడితే ఏదోలే అనుకుని వదిలేశాం. మరి తెలిసి భోళా శంకర్‌కు ఒప్పుకున్న మీ భోళాతనానికి నష్టపోతున్నది మీరో ప్రొడ్యూసర్లో కాదు. ఆర్థికంగా మానసికంగా అభిమానులు. నా స్కూల్ చెడ్డీల వయసు నుంచి నా కొడుక్కి ప్యాంట్లు తొడిగే ఏజ్ దాకా నా ప్రయాణంలో కొన్ని వందల వేల గంటలు, లక్షల రూపాయలు మీ సినిమాలకు ఖర్చు పెట్టాను. కాబట్టి ఓ తమ్ముడిగా నేను ఇలా అడగొచ్చని అనుకుంటున్నాను.
దయచేసి మీ స్థాయి గుర్తించండి. కామెడీ స్కిట్లు చేసే పది మంది ఆర్టిస్టులు వచ్చి భజన చేస్తే వాళ్ళకు కలిసి భోజనం చేసే అదృష్టం కలిగించండి. అంతే కానీ బలవంతంగా లేని పాత్రలు సృష్టించి ఆఫర్లు ఇప్పించకండి. న్యూ ఏజ్ ఫిలిం మేకర్స్, రైటర్స్‌ని పిలిపించండి. ఇప్పటి ట్రెండ్(trend) మీద అవగాహన లేని రచయితలను డైరెక్టర్లను దూరం పెట్టండి. మళ్ళీ మళ్ళీ ఈ అనుభవం వద్దు. ఈ రోజు హాలులో ఉదయం 7 గంటలకు చాలా ఫ్యామిలీలు ఇంట్లో పొయ్యి వెలిగించకుండా సినిమాకు వచ్చాయి.. అదీ మీ రేంజ్. చెక్కుచెదరని సింహాసనం మీద మగమహారాజులా ఉన్న మీ కాలు కుర్చీలు కోసేందుకు కత్తులు అక్కర్లేదు. పొగడ్తలు చాలు. అవి మనకొద్దు అన్నయ్యా. ఎంత బాధ పడి ఉంటే ఇంత పెద్దగా రాస్తాను చెప్పు. నువ్వేం చేసినా ఆహా అనే రకం నేను కాదు. చెప్పులు తెగిపోతే కొత్తవి కొనుక్కోమని నాన్నకు చెబుతాను. అలాగే నీ కిరీటంపై వజ్రాలను దొంగలు ఎత్తుకుపోతుంటే హెచ్చరిక చేయకుండా ఎలా ఉంటాను. నీ దాకా చేరదని తెలిసి కూడా ఏదో చెప్పకుండా ఉండలేకపోయా. ఇంకా చాలా ఉంది కానీ మరీ ఇక్కడితో ఆపేద్దాంలే.. అని రాసుకొచ్చాడు. మరి మెగాభిమానుల వేదన చూసి అయిన చిరు(chiranjeevi) రీమేక్ సినిమాలకు దూరంగా ఉంటారేమో చూడాలి.