»Super Star Rajini Kanth Rampage Jailor 2 Confirmed
Rajinikanth: ర్యాంపేజ్..’జైలర్ 2′ కన్ఫామ్!
సూపర్ స్టార్ రజినీకాంత్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. రెండున్నర రోజుల్లోనే అన్ని సెంటర్స్‌లో బ్రేక్ ఈవెన్ అయిన జైలర్ మూవీ.. మూడు రోజుల్లో రూ.200 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసింది. ఇక సండే సాలిడ్ బుకింగ్స్‌తో 300 కోట్లు కొల్లగొట్టింది. అంతేకాదు మధ్యలో మండేని వదిలిపెడితే.. నెక్స్ట్ డే ఆగష్టు 15 హాలిడే అవడంతో.. రూ.400 కోట్లు కొల్ల గొట్టడం ఖాయమంటున్నారు. ఇదే జోష్‌లో జైలర్ సీక్వెల్ కూడా ఫిక్స్ చేశాడు డైరెక్టర్.
super star Rajini kanth rampage Jailor 2 confirmed
బాక్సాఫీస్ దగ్గర రజనీ కాంత్(Rajinikanth) ర్యాంపేజ్ ఎలా ఉంటుందో ‘జైలర్’ సినిమా ప్రూవ్ చేస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులుపుతోంది. విడుదలైన అన్ని చోట్ల రజనీ ర్యాంపేజ్ నడుస్తోంది. ముఖ్యంగా తెలుగులో మెగాస్టార్ భోళా శంకర్ సినిమా థియేటర్లో ఉన్నా కూడా.. జైలర్‌కు అన్ని చోట్ల హౌజ్ ఫుల్ బోర్డ్‌లు కనిపిస్తున్నాయి. ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యే వరకు రూ.400 కోట్లు కొల్లగొట్టడం ఖాయమంటున్నారు. అంతేకాదు.. ఫైనల్ రన్లో ఈ సినిమా రూ.500 కోట్లు రాబట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ఈ సినిమాకు నెల్సన్ మేకింగ్, అనిరుధ్ మ్యూజిక్ అదిరిపోయింది. చివరగా విజయ్ ‘బీస్ట్’ సినిమాతో మెప్పించేలేకపోయిన నెల్సన్.. జైలర్‌తో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు.
అంతేకాదు..ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నాడు. జైలర్2(jailer2) ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే కాస్త టైమ్ పడుతుందని..ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు నెల్సన్. అంతేకాదు.. రజనీ కాంత్, విజయ్‌తో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చేసే ఆలోచన కూడా ఉందని అంటున్నాడు. దీంతో తలైవా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. జైలర్ సినిమానే ఈ రేంజ్లో ఉంటే.. ఇక పార్ట్ 2 ఇంకే రేంజ్లో ఉంటుందోనని ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. జైలర్‌లో కన్నడ నుంచి శివరాజ్ కుమార్, మళయాళం నుంచి మోహన్ లాల్‌తో కామియో రోల్స్ చేయించి.. సక్సెస్ అయ్యాడు నెల్సన్. తెలుగులో బాలయ్యను అనుకున్నప్పటికీ సరైన క్యారెక్టర్ పడకపోవడంతో.. అప్రోచ్ అవలేదు. కానీ జైలర్ 2లో మాత్రం బాలయ్య కనిపించే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడుంటుందో చూడాలి.