ప్రైవేట్ ట్రావెల్స్ (Private Travels) లో బస్సు నడుపుతున్న ఈ డ్రైవర్ ఈమధ్య తన ఉద్యోగం కోల్పోయింది. తమిళ రాజకీయ పార్టీ డీఎంకే (DMK) ఎంపీ కనిమొళి ఇటీవల కోవై(Kovai)లో పర్యటించారు. ఆ సమయంలో షర్మిల (Sharmila) నడుపుతున్న బస్సులో ప్రయాణించి ఆమెను ప్రశంసించి ఒక వాచ్ కూడా బహుమతిగా ఇచ్చారు. అయితే ఆ ప్రయాణంలో బస్సులోని కండక్టర్(Conductor).. ఎంపీని టికెట్ కొనుగోలు చేయాలంటూ కోరింది. ఈ విషయంలో డ్రైవర్ షర్మిల మరియు కండక్టర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయం ట్రావెల్స్ యాజమాన్యం వరకు చేరింది. ఎంపీతో కండక్టర్ తప్పుగా ప్రవర్తించిందని షర్మిల అంటే, తను (షర్మిల) ఫేమస్ అవ్వడానికి సెలబ్రిటీస్ ని బస్సు ఎక్కించి తోటి ప్రయాణకులను ఇబ్బందికి గురి చేస్తుందని కండక్టర్ కంప్లైంట్ చేసింది.
గతంలో కూడా షర్మిల గురించి పలువురు సెలబ్రిటీస్ బస్సు ఎక్కిన సందర్భాలు ఉన్నాయి. వీరిద్దరి వాదనలు విన్న యాజమాన్యం షర్మిలను ఉద్యోగంలో నుంచి తీసేసింది. ఈ విషయం తమిళనాట (Tamil Nadu) చర్చనీయాంశం అయ్యింది. యువతకు ఎంతో స్ఫూర్తిని కలిగించిన షర్మిల డ్రైవర్ గానే మిగిలిపోకూడదు. మా కమల్ కల్చరల్ సెంటర్ నుంచి ఆమెకు ఒక కారుని అందజేస్తున్నం. క్యాబ్ సర్వీసులకే కాకుండా మరికొంతమందికి ఉపాధి (Employment) కల్పించే పారిశ్రామికవేత్తగా ఈ కారుని ఉపయోగించుకోవచ్చు. నా ఉద్దేశం ఎంతో మంది షర్మిలలను తయారు చేయడమే” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో నెటిజెన్లు కమల్ కి సలాం అంటున్నారు.