‘లస్ట్ స్టోరీస్ 2′(Lust Stories 2) సిరీస్ ఈ నెల 29న విడుదల కాబోతోంది. విడుదలకు ముందే సంచలనాలు, వివాదాలకు కేంద్రమవుతోంది. నాలుగు భాగాలుగా వస్తున్న ఈ చిత్ర సంకలనాలకు అమిత్ ఆర్ శర్మ(Amit R Sharma), ఆర్ బాల్కీ, సుజోయ్ ఘోష్, కొంకణాసేన్ శర్మ దర్శకులు. ప్రమోషన్స్ సందర్భంగా కాజోల్ (Kajol) ను లస్ట్ అంటే ఏమిటని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా… లస్ట్ అంటే విపరీతమైన కోరిక అని… అది మన శారీరక వాంఛ మాత్రమే కాదని, ఏదైనా కావొచ్చని ఆమె తెలిపారు.
తన వరకైతే తన లైఫ్ పెద్ద లస్ట్ అని అన్నారు. ఇష్టమైన ఆహారాన్ని తినడం, పిల్లలతో గడపడం, డ్యాన్స్ చేయడం
(Dancing), మ్యూజిక్ ను ఆస్వాదించడం, తనకు అలవాటైన కుట్లు, అల్లికలు ఇవన్నీ తనకు లస్ట్ తో సమానమని చెప్పారు. ఇందులో కాజోల్, మృణాల్ ఠాకూర్, తమన్నా భాటియా(Tamannaah Bhatia), విజయ్‌వర్మ, కుముద్ మిశ్రాలాంటి భారీ తారాగణం నటిస్తోంది. ఆశిష్ దువా, రోనీ స్క్రూవాలా నిర్మాతలు.