ఆరేళ్లుగా కేరళ (Kerala) వ్యాప్తంగా వేలాది మంది మహిళలు ప్రతి రోజు తమకు తెలియని వారి కోసం తమ ఇళ్లలో భోజనం (meal) వండి ప్యాక్ చేసి ఇస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేద రోగులు, వారి బంధువులు, అన్నార్తుల కడుపులు నింపుతున్నారు. తమ వంతు వచ్చిన ప్రతి మహిళ తన కుటుంబంతోపాటు మరోకరు లేదా ఇద్దరికి సరిపోయేలా ఇంటిలోనే ఆహారం వండుతుంది. వాటిని ప్యాక్ చేసి కలెక్ట్ చేసే వారికి ఇస్తుంది. వారు ఆ ఆహార పొట్లాలను ప్రభుత్వ ఆసుపత్రుల (Government hospitals) వద్ద, పుడ్ కావాల్సిన వారికి పంపిణీ చేస్తారు.2017లో కేవలం 300 ఆహార పొట్లాలతో మొదలైన ఈ ఉద్యమం నేడు 40,000 మీల్స్ ప్యాకెట్లకు చేరింది. ‘పోతిచోరు’ (pothichoru) గా పిలిచే ‘భోజనం పొట్లం’ ఉద్యమానికి కేరళలో అధికారంలో ఉన్న సీపీఎం యువజన సంస్థ అయిన డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డీవైఎఫ్ఐ) చేపట్టారు.
2017 జనవరి 1న తిరువనంతపురంలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో 300 ఆహార పొట్లాల పంపిణీతో దీనిని ప్రారంభించారు. పేదల కోసం చేపట్టిన ఈ ప్రచారాన్ని ‘హృదయపూర్వం’ (Hrithayapoorvvam’) అని వ్యవహరిస్తారు. సాధారణ భాషలో ‘హార్టీ మీల్ పార్సెల్’ అని పేర్కొంటారు.ఇలాంటి సందర్భాల్లో తాము వండిన ఆహారం సరిగా లేకపోతే క్షమించాలంటూ ఒక చీటిలో రాసి ఆ ఆహార పొట్లాలలో ఉంచుతారు. అలాగే ఆ ఆహారం అందుకున్న రోగులు త్వరగా కోలుకోవాలని కూడా ఆ చీటీలో పేర్కొంటారు. ఇలాంటి ఆహార పొట్లం అందుకున్న టీచర్ రాజేష్ మోంజీ(Rajesh Monji) ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఏడాది జనవరిలో తన తల్లికి చికిత్స కోసం కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఒక బాలిక వండిన భోజనం పార్సిల్(Meal parcel)ను ఆయన అందుకున్నారు. ఆ పాప తయారు చేసిన ప్రతి అన్నం గింజ ప్రేమతో నిండి ఉందని తన పోస్ట్‌లో ఆయన తెలిపాడు