తన డ్యూటీ టైమ్ అయిపోయిందని ప్రయాణికులను ఎయిర్‌పోర్టు(Airport)లోనే వదిలేసి వెళ్లిపోయారు ఓ పైలెట్. ఈ ఘటన జైపూర్ ఎయిర్‌పోర్టులో జరిగింది. ఉద్యోగులు పనివేళలను సీరియస్‌గా తీసుకొంటే జరిగే విపరీతాలకు ఇదో మచ్చుతునక. షిప్ట్ టైమ్(Shift time) ముగిసిన తర్వాత ఉద్యోగులు ఎలా వ్యవహరిస్తారో తెలిపే ఘటన ఇది. ఓ పైలెట్ (Pilot) అనూహ్య నిర్ణయం.. ప్రయాణికులకు చుక్కలు చూపించింది. తన డ్యూటీ టైమ్ ముగిసిందని విమానాన్ని మధ్యలో వదిలేసి వెళ్లారు.షెడ్యూల్ ప్రకారం ఏఐ-112 విమానం లండన్ నుంచి ఢిల్లీకి శనివారం తెల్లవారుజామున 4 గంటలకు చేరాల్సి ఉన్నది. 350 మంది ప్రయాణికులతో వస్తున్నఈ విమానాన్ని ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా జైపూర్ ఎయిర్‌పోర్టు(Jaipur Airport)కు మళ్లించారు.
కొన్ని గంటల తర్వాత ఢిల్లీ(Delhi)కి వెళ్లేందుకు లండన్ విమానానికి అధికారుల నుంచి క్లియరెన్స్ లభించింది.కానీ, పైలెట్ విమానం నడిపేందుకు నిరాకరించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేసిన ఎయిర్ ఇండియా (Air India) అధికారులు మరో పైలెట్ ద్వారా విమానాన్ని ఢిల్లీకి పంపించారు. మూడు గంటలు లేట్‌గా విమానం ఢిల్లీకి చేరుకున్నది. అయితే, విమాన ప్రయాణికుడు ఒకరు ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్టు చేశారు. @లండన్ (London) నుంచి ఢిల్లీకి వచ్చే AI-112 విమానం చెడు వాతావరణం కారణంగా జైపూర్‌కు మళ్లించబడింది. దయచేసి మాకు అత్యవసరంగా సహాయం చేయండి. జైపూర్ ఎయిర్పోర్ట్ అధికారుల నుంచి మాకు ఎటువంటి సహాయం అందడం లేదు* అని తెలిపారు. జైపూర్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఫొటోలను కూడా షేర్ చేశారు.