ఏసీ కంప్రెషర్(Ac Compressor) పేలి ఇద్దరు దుర్మరణం చెందిన ఘటన నల్లగొండ(Nalgonda)లో చోటుచేసుకుంది. వెటర్నరీ ఆస్పత్రి సమీపంలోని మిర్యాలగూడ రోడ్డు బర్కత్ పుర కాలనీలో జరిగిన ఈ దారుణం స్థానికంగా కలకలం రేపింది. న్యూ స్టార్ ఫ్రూట్ గోడౌన్లో కోల్డ్ స్టోరేజ్ ఓనర్ షేక్ కలీమ్, సాజిద్ ఉన్నారు. ఆ సమయంలోనే బనాన ఏసీ కంప్రెషర్ పేలింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.
ఏసీ కంప్రెషర్(Ac Compressor) పేలిన సమయంలో ఆ ప్రాంతంలో మొత్తం నలుగురు ఉన్నారు. అయితే పేలుడు జరిగిన సమయంలో ఇద్దరూ అక్కడి నుంచి తప్పించుకున్నారు. దీంతో వారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. పేలుడు వల్ల షేక్ కలీమ్, సాజిద్ల శరీర అవయవాలు తెగిపడటంతో ఆ ప్రాంతం భయానకంగా మారింది.
ఈ పేలుడు వల్ల భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. స్థానికుల సమాచారం మేరకు..నల్లగొండ ఏఆర్ అడిషనల్ ఎస్పీ హనుమంతరావు, డిఎస్పీ నరసింహారెడ్డి, జిల్లా ఎస్పీ అపూర్వరావు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు.