భానుడి ప్రతాపంతో రాష్ట్రంలోని ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. గత పదేళ్లలో ఎప్పుడూ నమోదు కానంతలో ఎండలు కాస్తున్నాయి. ప్రజలు బయటకు వెళ్లవద్దని అధికారులు సూచనలు ఇస్తున్నారు.
Summer Effect: భానుడి ప్రతాపంతో రాష్ట్రంలోని ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. గత పదేళ్లలో ఎప్పుడూ నమోదు కానంతలో ఎండలు కాస్తున్నాయి. రోజురోజుకి కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. పది జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్ దాటింది. అత్యధికంగా నల్గొండ జిల్లా మునుగోడు మండలం గూడాపూర్‌లో 46.6 డిగ్రీలు నమోదైంది. జిల్లాలోని పలు మండలాలు 46.5 నుంచి 46.2 డిగ్రీలు నమోదవుతుంది. రాష్ట్రంలో సాధారణం కన్నా సగటున 2.1 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. గతేడాదితో పోలిసన్తే ఈ ఏడాది 7.5 డిగ్రీలకు పైనే పెరుగుదల ఉంది.
నల్గొండ జిల్లాలో 8 మండలాలు, జగిత్యాలలో 6, కరీంనగర్లో 4, సిద్ధిపేటలో 3, మంచిర్యాలలో 3, ఆసిఫాబాద్‌లో 2, జగిత్యాల జిల్లాలో 2 మండలాలతో పాటు ఖమ్మం నగరంలో ఈ నెల 5వ తేదీ వరకు వడగాలుల ముప్పు ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. వడదెబ్బతో చాలామంది చనిపోతున్నారు. కరీంనగర్ జిల్లాలోలో దివ్యాంగ బాలుడు కల్లెం యశ్వంత్ ఇంట్లో రేకుల వేడికి తాళలేక మృతిచెందాడు. వడదెబ్బ కారణంగా చాలామంది బయటకు వెళ్లి వచ్చి తలనొప్పిగా ఉందంటూ పడిపోయి చనిపోతున్నారు. ఈ ఎండలకు బయటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు.