»Padi Kaushik Reddy Case Registered Against Brs Mla Under New Law
Padi Kaushik Reddy: కొత్త చట్టం కింద బీఆర్ఎస్ ఎమ్యెల్యేపై కేసు నమోదు
కొత్త చట్టం కింద హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్ ఒకటో ఠాణాలో కేసు నమోదైంది. నిన్న నిర్వహించిన జిల్లా పరిషత్ సమావేశంలో అధికారుల విధులకు ఆటంకం కలిగించినందుకు అతనిపై కేసు నమోదు చేశారు.
Padi Kaushik Reddy: Case registered against BRS MLA under new law
Padi Kaushik Reddy: కొత్త చట్టం కింద హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్ ఒకటో ఠాణాలో కేసు నమోదైంది. నిన్న నిర్వహించిన జిల్లా పరిషత్ సమావేశంలో అధికారుల విధులకు ఆటంకం కలిగించారు. దీంతో అతనిపై కొత్తగా అమల్లోకి వచ్చిన భారత న్యాయ సంహిత సెక్షన్ 122, 126(2) చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా జడ్పీ సమావేశం నుంచి వెళ్తున్నారని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని ఎమ్యెల్యే అడ్డుకున్నారు. అతను వెళ్లే మార్గంలో నేలపై బైఠాయించి నిరసన తెలిపారు.
జడ్పీ ఛైర్పర్సన్ కనుమల్ల విజయ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ ప్రపుల్దేశాయి, ఇతర అధికారులు కూడా హాజరయ్యారు. విద్యాశాఖ ప్రగతిపై సమీక్ష నిర్వహించి.. అందులో పాల్గొన్న ఎంఈవోలకు జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు మెమోలు జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ జడ్పీటీసీలంతా డీఈవోను సస్పెండ్ చేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దీనిపై కలెక్టర్ సమాధానం చెప్పాలని కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. అలా సభలో ఆందోళన పెరడగంతో కుర్చీలో నుంచి లేచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా ఎమ్మెల్యే ఆమె ఎదుట నేలపై బైఠాయించారు. ఈ తర్వాత పోలీసులకు ఆయనకు మధ్య వాగ్వాదం జరిగింది.