»Malayalam Actor Prithviraj Sukumaran As Villain In Mahesh Rajamouli Film
SSMB29: మహేష్ – రాజమౌళి చిత్రంలో విలన్‌గా మలయాళ స్టార్?
సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న చిత్రంపై ఇప్పటి నుంచే ఎన్నో అంచనాలు, ఉహాగానాలు వస్తున్నాయి. తాజాగా ఈ చిత్రంలో విలన్‌గా ఓ మలయాళ సూపర్‌స్టార్ నటిస్తున్నట్లు టాక్ నడుస్తుంది.
Malayalam actor Prithviraj Sukumaran as villain in Mahesh-Rajamouli film
SSMB29: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) చేస్తున్న తరువాతి సినిమాపై పాన్ఇండియానే కాదు, ప్రపంచ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఆయన తెరకెక్కించిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు ఏ రేంజ్లో ఉన్నాయో అందరమూ చూశాము. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ వచ్చిన సమయంలో హాలీవుడ్ దర్శకులు సైతం ఆ చిత్రాన్ని, డైరెక్టర్ క్రియేటివిటీని కొనియాడారు. ఆ తరువాత ఆయన తన తరువాతి సినిమాను మహేష్ బాబుతో ఉంటుందని ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న మహేష్ బాబు ఫ్యాన్స్ ఎగిరి గంతేశారు. ఈ చిత్రం మహేష్ బాబుకు(Mahesh Babu) 29 వ చిత్రం అవుతుండంతో హ్యాష్ ట్యాగ్ ఎస్ఎస్ఎంబీ29 పేరిట సోషల్ మీడియాలో చాలా రకాల వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.
ముందుగానే రాజమౌళి చెప్పినట్లు సినిమా స్టార్ట్ అవడానికి దాదాపు 6 నెలలు ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక సాలిడ్ అప్డేట్ వినిపిస్తుంది. మహేష్ బాబుకు విలన్‌గా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రానికిి వి.విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం, పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆగస్టులో ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆఫ్రికా, అమెజాన్ అడవుల్లో భారీ యాక్షన్ అండ్వెంచర్ సన్నివేశాలను చిత్రీకరించే అవకాశం ఉందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వస్తే కానీ తెలియదు.