టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నెగెటివ్ పాత్రలో కనిపించబోతున్నాడా? అంటే, అవుననే సమాధానం వినిస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి, మహేష్ బాబుని వేరే లెవల్లో చూపించబోతున్నాడట. అందులో ఒకటి మామూలుగా ఉండదని అంటున్నారు.
SSMB 29: సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకు పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు డైరెక్ట్‌గా రాజమౌళితో హాలీవుడ్ సినిమానే చేస్తున్నాడు. అన్‌లిమిటేడ్ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసిన జక్కన్న.. ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. మరోవైపు మహేష్ బాబు బాడీ బిల్డింగ్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే లాంగ్ హెయిర్‌తో కనిపిస్తున్నాడు మహేష్. ఆగష్టులో ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉండే ఛాన్స్ ఉంది. కానీ ఈలోపు ఇండస్ట్రీ వర్గాల నుంచి వచ్చే అప్డేట్స్ మాత్రం మామూలుగా ఉండడం లేదు.
లేటెస్ట్గా.. మహేష్ బాబు ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడనే టాక్ వైరల్‌గా మారింది. అందులోను ఓ పాత్ర నెగిటీవ్ షేడ్స్‌తో ఉంటుదని అంటున్నారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ క్యారెక్టర్లో నెగెటివ్ షేడ్స్ ఉంటాయట. ఇక మరో పాత్రలో ప్రపంచ యాత్రికుడిగా కనిపించనున్నాడట. ఇందులో నిజమెంతో తెలియదు కానీ, మహేష్ బాబు నెగెటివ్ షేడ్స్ అంటే.. మామూలుగా ఉండదు. అది కూడా రాజమౌళి సినిమా కాబట్టి.. మామూలుగా ఉండదు.
అయితే.. అసలు జక్కన్న ఎలా ప్లాన్ చేస్తున్నాడనే విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. అనౌన్స్మెంట్ వస్తే గానీ, ఇలాంటి విషయాల్లో ఓ క్లారిటీ రాదు. కానీ.. ప్రజెంట్ ఆర్టిస్టుల ఎంపిక కోసం టెస్ట్ షూట్ జరుగుతున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే మలయాళ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమార్ విలన్‌గా నటిస్తున్నాడనే టాక్ బయటికొచ్చింది. అలాగే.. హీరోయిన్గా ఇండోనేషియా బ్యూటీ చెల్సీయా ఎలిజబెత్ ఇస్లాన్ నటించనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి.. ఎస్ఎస్ఎంబీ 29 ఎలా ఉంటుందో చూడాలి.