»Mlc Kavitha Judgment Postponed On Kavithas Bail Petition
MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్పై తీర్పు వాయిదా
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు అయిన ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే కవిత బెయిల్ పిటిషన్ తీర్పును ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది.
MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు అయిన ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే కవితకు మళ్లీ నిరాశే మిగిలింది. ఆమె బెయిల్ పిటిషన్ తీర్పును ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. ఈ నెల 6కు తీర్పుు స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా వాయిదా వేశారు. అయితే కవిత బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 22న కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. రౌస్ అవెన్యూ కోర్టు నేడు తీర్పును రిజర్వ్ చేసింది. అదే రోజున ఈడీ, సీబీఐ కేసుల్లో ఒకే రోజు వేర్వేరుగా కవిత బెయిల్ పిటిషన్లపై తుది ఉత్తర్వులు ఇవ్వనున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ కవితను మార్చి 15న అరెస్టు చేసింది. కవితనకు ఈ నెల 7వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఇంతకు ముందు తీర్పునిచ్చింది.