Is it necessary for KCR to go to Maharashtra with 500 cars?
KCR: తెలంగాణ అసెంబ్లీకి కొన్ని నెలల్లో ఎన్నికలు.. ప్రజా సంక్షేమ పథకాల అమలులో లోపాలు.. నిత్యావసర ధరలు పైపైకి.. మధ్యతరగతి ప్రజల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. జనం సమస్యలే కాదు.. ఎన్నికలపై ధ్యాస కూడా లేదు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు. ఇవేమి పట్టవన్నట్టు ఇతర రాష్ట్రం బారిన పడుతున్నారు. వీలు కల్పించుకొని మరీ మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. మళ్లీ రెండు రోజుల పర్యటనకు బయల్దేరారు గులాబీ దళపతి. మహారాష్ట్రపై కేసీఆర్ ఎందుకు ఫోకస్ చేశారు..? హిట్ టీవీ వెబ్ ప్రత్యేక కథనం.
మారిన కేసీఆర్ తీరు
టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారడంతో సీఎం కేసీఆర్(CM KCR) వ్యవహార శైలి మారింది. అంతకు ముందు తెలంగాణ రాష్ట్రం, ప్రభుత్వ పథకాలపై సమీక్ష చేసేవారు. ఇప్పుడు తన పార్టీని ఇతర రాష్ట్రాల్లో విస్తరించడంపై దృష్టి సారించారు. పొరుగున గల మహారాష్ట్రపై కేసీఆర్ కన్ను పడింది. అక్కడ పార్టీని బలోపేతం చేయాలని అనుకుంటున్నారు. నాందేడ్, కాందార్ లోహ, ఔరంగబాద్, నాగ్‌పూర్‌లో సభలు, సమావేశాలు నిర్వహించారు. నాగ్‌పూర్‌లో పార్టీ శాశ్వత కార్యాలయాన్ని ప్రారంభించారు. ఔరంగబాద్, షోలాపూర్, పుణే, ముంబైలో కూడా పార్టీ శాశ్వత కార్యాలయం ఏర్పాటు చేస్తారట. సభ్యత్వ నమోదు వేగం పెంచాలని అధినేత ఆదేశించినట్టు తెలిసింది. మహారాష్ట్రలో 50 లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యంగా పనిచేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
CM Sri. KCR Rally Visuals from Pragathi Bhavan to Sholapur pic.twitter.com/BzqsAPSbTN
— Latha (@LathaReddy704) June 26, 2023
జనం ఇబ్బందులు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు నుంచి రెండు రోజులు మహారాష్ట్రలో పర్యటిస్తారు. ఆయన వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు ఉంటారు. వీరంతా కలిసి వెళ్లేది విమానంలో కాదు. రోడ్డు మార్గానా.. కార్లలో వెళతారు. 500 కార్లతో వెళుతూ తన బలం చూపించే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. ఇన్నీ వాహనాలు అంటే కాలుష్యం.. ట్రాఫిక్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సిటీలో సీఎం కాన్వాయ్ ట్రావెల్ చేస్తేనే వాహనాలు ఆపుతుంటారు. కూకట్ పల్లి, పటాన్ చెరు, సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ మీదుగా కర్ణాటకలోకి ప్రవేశిస్తారు. అప్పటి వరకు ఆయా చోట్ల జనానికి ఇబ్బందులు తప్పవు. సీఎం కాన్వాయ్ పేరుతో అక్కడ వాహనాలను నిలిపివేస్తారు.
500 కార్లతో అవసరమా..?
సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన వెళుతున్నారు. పార్టీ బలోపేతం కోసం అని చెబుతున్నారు. ఇప్పటివరకు అక్కడ చోట మోట నేతలు చేరారు. బలమైన నేత బీఆర్ఎస్ పార్టీలో చేరలేదు. అయినప్పటికీ 500 కార్లతో వెళ్లడం అవసరమా..? అనే ప్రశ్న వస్తోంది. ఇంత మంది మార్బలంతో కలిసి వెళ్లడానికి గల కారణం..? తమ పార్టీ తోపు అని చెప్పడమా..? లేదంటే మహారాష్ట్రలో విస్తరణకు సానుకూలం అవుతుందా..? పార్టీలో నిధులు ఉంటే మాత్రం.. ఈ స్థాయిలో ఖర్చు చేయాలా..? అనే ప్రశ్నలు వస్తున్నాయి. విపక్షాలు, మేధావుల నుంచి ప్రశ్న రాగా.. గులాబీ దళం మాత్రం చడీ చప్పుడు చేయడం లేదు. ప్రజా సొమ్మునే ఇలా వృథా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కేసీఆర్ ఇప్పుడే కాదు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా భారీ కార్లతో ర్యాలీగా ఢిల్లీ వెళ్లారు. అప్పుడు దేశం దృష్టిని ఆకర్షించారు. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కూడా పార్టీ విస్తరణ కోసం భారీ కాన్వాయ్ తీసుకెళుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలో పార్టీ విస్తరణ జరుగుతుందని విశ్వసిస్తున్నారు.
#Telangana CM KCR left for Solapur in Maharashtra by road from Pragathi Bhavan .
CM KCR is accompanied by a convoy of about 600 vehicles including State ministers, MPs, MLCs, MLAs and party senior leaders. pic.twitter.com/42BBpGg7Np— Naveena (@TheNaveena) June 26, 2023
పండరీపూర్, తుల్జాపూర్లో పూజలు ఇందుకేనా..?
సీఎం కేసీఆర్‌కు భక్తి భావం ఎక్కువ. ఏ రాష్ట్రం వెళ్లినా సరే అక్కడ ఉన్న ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తుంటారు. ఈ రోజు మధ్యాహ్నం మహారాష్ట్రలో గల ఒమర్గాకు చేరుకుని.. అక్కడ మధ్యాహ్న భోజనం చేస్తారు. రాత్రి షోలాపూర్ వెళ్లి.. అక్కడ బస చేస్తారు. మంగళవారం ఉదయం పండరీపూర్ చేరుకుని శ్రీ విఠల రుక్మిణీ మందిర్‌లో ప్రత్యేక పూజలు చేస్తారు. మధ్యాహ్నాం తుల్జాపూర్ చేరుకుని భవానీమాత మందిరంలో పూజలు నిర్వహిస్తారు. గతంలో సీఎంలు, పార్టీ అధినేతలు, కీలక నేతలు కూడా పర్యటన చేశారు. కానీ వారు కాన్వాయ్, మంది మార్బలంతో వెళ్లింది ఎన్నికల సమయంలోనే.. మహారాష్ట్రలో ఎన్నికలు లేవు. కానీ ఆ ప్రాంతంపై గులాబీ దళపతి ఫోకస్ చేశారు. ఉ అంటే చాలు మహారాష్ట్ర వెళుతున్నారు. తన పార్టీని బలోపేతం చేసే స్వార్థ్యంతో మంది మార్బలాన్ని వెంటేసుకుని వెళుతున్నారు. ఇలా వెళితే తప్పేం లేదు కానీ.. జనాలను ఇబ్బందికి గురిచేయడం తప్పు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి.. రాష్ట్రాలు తిరగడం తప్పుని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
BRS National President and Chief Minister Sri K Chandrashekhar Rao left for Solapur in Maharashtra by road from Pragathi Bhavan today.
CM KCR is accompanied by a huge convoy of about 600 vehicles including State ministers, MPs, MLCs, MLAs and party senior leaders. pic.twitter.com/J7wfA9QXPf
— Sarita Avula (@SaritaAvula) June 26, 2023