నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలిగా వేలూరు రేవతి నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. వేలూరు రేవతి సోమశిల ప్రాజెక్టు ఛైర్మన్ వేలూరు కేశవ చౌదరి సతీమణి కాగా, వీరి స్వగ్రామం చేజర్ల మండలం నాగులవెల్లటూరు. పార్టీ బాధ్యతలు అప్పగించినందుకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.